For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్‌పే, పేటీఎంను క్రాస్ చేసి... వరుసగా 2వ నెల ఫోన్‌పే రికార్డ్

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అనుబంధసంస్థ ఫోన్‌పే వరుసగా రెండో నెలలో టాప్‌లో నిలిచింది. జనవరి నెలలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ట్రాన్సాక్షన్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా రెండో నెలలో గూగుల్‌పేను అధిగమించింది. జనవరి నెలలో మొత్తం UPI ట్రాన్సాక్షన్స్‌లో 41 శాతం వాటాతో 968.72 మిలియన్ల ట్రాన్సాక్షన్ వ్యాల్యూమ్‌తో ఉంది. డిసెంబర్ నెలలోను యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో ఫోన్‌పే తొలి స్థానంలో నిలిచింది.

ఏ యాప్ నుండి ఎంత వ్యాల్యూ?

ఏ యాప్ నుండి ఎంత వ్యాల్యూ?

నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకారం ఫోన్‌పే ట్రాన్సాక్షన్స్ జనవరి నెలలో 7 శాతం పెరిగాయి. వ్యాల్యూపరంగా 5 శాతం పెరిగాయి. ఫోన్‌పే తర్వాత గూగుల్ పే 853.53 మిలియన్ ట్రాన్సాక్షన్స్‌తో రెండో స్థానంలో ఉంది. గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూ రూ.1.71 లక్షల కోట్లు. 281.18 మిలియన్ ట్రాన్సాక్షన్స్‌తో పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. ఈ ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూ రూ.33,910 కోట్లు. ఇక, అమెజాన్ పే, భీమ్ యాప్, వాట్సాప్ పేమెంట్ యాప్ పేమెంట్స్ వరుసగా (వ్యాల్యూ పరంగా) రూ.4,004 కోట్లు, రూ.7,463 కోట్లు, రూ.36 కోట్లుగా ఉంది.

వేగంగా పెరుగుతున్న ట్రాన్సాక్షన్స్

వేగంగా పెరుగుతున్న ట్రాన్సాక్షన్స్

జనవరి నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొత్తం 2.3 బిలియన్లుగా నమోదయ్యాయి. వీటి వ్యాల్యూ రూ.4.2 లక్షల కోట్లు. క్రమంగా యూపీఏ పేమెంట్స్ పెరగడం పట్ల నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పందిస్తూ ఇది అసాధారణమైనదిగా పేర్కొన్నారు. ఏదేని ఒక నెలలో 1 బిలియన్ UPI ట్రాన్సాక్షన్స్ క్రాస్ కావడానికి మూడేళ్లు సమయం తీసుకున్నదని, అయితే మరో బిలియన్ ట్రాన్సాక్షన్స్ జతకలవడానికి ఏడాది లోపు మాత్రమే తీసుకుందన్నారు.

ఫోన్ పే రికార్డ్

ఫోన్ పే రికార్డ్

2021 జనవరి నెలలో రూ.4.3 ట్రిలియన్ల విలువైన 2.3 బిలియన్ డాలర్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ అసాధారణమని, యూపీఐ ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూ 76.5 శాతం పెరిగిందని అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు. డిసెంబర్ నెలలోను ఫోన్ పేనే 902 మిలియన్ ట్రాన్సాక్షన్స్, రూ.1.82 లక్షల కోట్ల వ్యాల్యూతో మొదటి స్థానంలో నిలిచింది.

English summary

గూగుల్‌పే, పేటీఎంను క్రాస్ చేసి... వరుసగా 2వ నెల ఫోన్‌పే రికార్డ్ | PhonePe beats Google Pay, Paytm in January, emerges top UPI player

Flipkart-backed PhonePe has again topped the Unified Payment Interface (UPI) chart in terms of transactions worth Rs 1.91 lakh crore, which is about 41 per cent of total UPI transactions done in January. PhonePe, with transaction volume of 968.72 million, has continued its leading streak for the second month in a row.
Story first published: Monday, February 8, 2021, 18:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X