For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇవ్వాళ్టి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలివే: వాహనదారులకు ఊరట దక్కిందా..లేదా!!

|

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ క్రమంగా పెరుగుదల బాటపట్టినట్టే. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 98.72 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 91.48 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. కొంతకాలంగా క్రూడాయిల్ మార్కెట్‌లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ- దేశీయ ఇంధన అమ్మకాల్లో ఎలాంటి మార్పులు ఉండట్లేదు.

ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

Petrol and Diesel price on August 14, 2022 was remain unchanged, Check the rates in your city

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

English summary

ఇవ్వాళ్టి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలివే: వాహనదారులకు ఊరట దక్కిందా..లేదా!! | Petrol and Diesel price on August 14, 2022 was remain unchanged, Check the rates in your city

Petrol and Diesel price on August 14, 2022 was remain unchanged, Check the rates in your city.
Story first published: Sunday, August 14, 2022, 8:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X