For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paytm: షేర్ల బైబ్యాక్ ప్రకటించిన పేటీఎం.. నమ్మకం కోల్పోతున్న ఇన్వెస్టర్లు.. ఎందుకిలా..?

|

Paytm: ఐపీవోగా వచ్చిన ఏడాదికే పేటీఎం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రస్తుతం కంపెనీ అనేక గడ్డు పరిస్థితులను, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రూ.850 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి బైబ్యాక్ చేస్తానని ప్రకటించినప్పటికీ షేర్ పతనం మాత్రం కొనసాగుతూనే ఉంది.

షేర్ బైబ్యాక్ వివరాలు..

షేర్ బైబ్యాక్ వివరాలు..

పేటీఎం మాతృసంస్థ అయిన సంస్థ One97 కమ్యూనికేషన్స్ బోర్డు కంపెనీ షేర్లను తిరిగి తానే కొనుగోలు చేయాలని ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపెనీ ఒక్కో షేరును రూ.810 చొప్పున వెనక్కి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రకటన తర్వాత మంగళవారం ట్రేడ్ చేసిన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.270 లాభపడ్డారు. అయినప్పటికీ పెట్టుబడిదారులు Paytm షేర్లపై విశ్వాసం వ్యక్తం చేయలేకపోయారు.

నేడు మళ్లీ తగ్గిన స్టాక్..

నేడు మళ్లీ తగ్గిన స్టాక్..

ఉదయం కంపెనీ షేర్లు స్వల్ప లాభంతో రూ.543.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే కాసేపటికే స్టాక్ విలువ 1.30 శాతం తగ్గి రూ.532.50కు చేరుకుంది. ఓపెన్ మార్కెట్ నుంచి షేర్లను కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయం ప్రకటించినా.. షేర్ విలువ పుంజుకోకపోవటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ప్రతిబింబిస్తోంది. కంపెనీ ప్రకటించిన బైబ్యాక్ ద్వారా కనీసం 5,246,913 ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. కంపెనీ దీనికి సంబంధించిన వివరాలను స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీకి కూడా తెలిపింది. గరిష్ఠంగా 6 నెలల కాలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఫ్లాప్ అయిన పేటీఎం ఐపీవో..

ఫ్లాప్ అయిన పేటీఎం ఐపీవో..

మార్కెట్లోకి ఐపీవోగా అరంగేట్రం చేసిన నాటి నుంచే పేటీఎంకు కష్టాలు మెుదలయ్యాయి. నవంబర్ 2021 ఇష్యూ సమయంలో పేటీఎం స్టాక్ ధర రూ.2,150గా ఉంది. కానీ ఇప్పుడు స్టాక్ ధర దాదాపుగా 75 శాతం పడిపోయింది. 2021లో అతిపెద్ద ఐపీవోగా వచ్చిన పేటీఎం ఏకంగా రూ.18,300 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవోని నమ్మి పెట్టుబడి పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు నష్టాలను చవిచూశారు.

English summary

Paytm: షేర్ల బైబ్యాక్ ప్రకటించిన పేటీఎం.. నమ్మకం కోల్పోతున్న ఇన్వెస్టర్లు.. ఎందుకిలా..? | Paytm investors lost hope on compay even after share buy back announcement

Paytm investors lost hope on compay even after share buy back announcement
Story first published: Wednesday, December 14, 2022, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X