For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్

|

డిజిటల్ పేమెంట్ మేజర్ పేపాల్ బుధవారం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఇండియాలో 4500 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా మరో వెయ్యిమందిని తీసుకోనున్నట్లు పేపాల్ ఇండియా తెలిపింది. భారత్‌లో డొమెస్టిక్ సేవలు ఎక్కువ కాలం కొనసాగించలేమని, భారత్‌లోని అంతర్జాతీయ సేవల పైన దృష్టి సారిస్తామని గతంలో తెలిపింది. తాజాగా మరో వెయ్యి మంది ఉద్యోగులను తీసుకోవడానికి సిద్ధమైంది. కొత్తగా తీసుకునే వెయ్యి ఉద్యోగాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ఉండనున్నాయి.

2021లో పెద్ద ఎత్తున ఇంజినీర్లను నియమించుకుంటామని తెలిపింది. సాఫ్టువేర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్ లెవల్, సీనియర్ రోల్స్‌లో నియామకాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలోని డెవలప్‌మెంట్ కేంద్రాల్లో ఈ నియామకాలు ఉంటాయని తెలిపింది.

PayPal to hire over 1,000 engineers for India development centres in 2021

కరోనా నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ పెరిగిందని, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్ తెలిపింది. పేపాల్‌కు ప్రస్తుతం భారత్‌లో మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత భారత్‌లోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవని తెలిపింది. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కస్టమర్లు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా ప్రతినిధి గురుభట్ అన్నారు.

English summary

పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్ | PayPal to hire over 1,000 engineers for India development centres in 2021

Digital payments major PayPal on Wednesday said it will hire 1,000 engineers this year for its India development centres across Bengaluru, Chennai, and Hyderabad.
Story first published: Wednesday, March 3, 2021, 19:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X