For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన వాహనాల విక్రయాలు.. కరోనా టైంలోనూ హై.. కారాణాలివే..

|

కరోనా వైరస్, స్ట్రెయిన్.. ఇతర వైరస్ వల్ల మార్కెట్ పడిపోయింది. ఇక వాహనాలు విక్రయాల సంగతి అంతే మరీ. అయితే ప్యాసెంజర్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌ రిటైల్‌‌‌‌ అమ్మకాలు డిసెంబర్‌‌‌‌ 2020 లో 23.99 శాతం పెరిగాయని ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్‌‌‌‌ ప్రకటించింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌, 2019 లో 2,18,775 ప్యాసెంజర్ వెహికల్స్ అమ్ముడవ్వగా, గత నెలలో 2,71,249 వెహికల్స్‌‌‌‌ సేల్‌‌‌‌ అయ్యాయని పేర్కొంది. ఫెస్టివ్‌‌‌‌ సీజన్‌‌‌‌ నుంచి వస్తున్న డిమాండ్‌ కొనసాగుతోందని తెలిపింది.

దేశంలో గల 1,270 ఆర్‌‌‌‌‌‌‌‌టీఓ ఆఫీస్‌‌‌‌ల నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ ఆధారంగా ఫాడా ఈ డేటాను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 14,24,620 టూ వీలర్లు సేల్‌‌‌‌ అయ్యాయని, ఇవి డిసెంబర్, 2019 లో అమ్ముడయిన 12,73,318 వెహికల్స్‌‌‌‌ కంటే 11.88 శాతం ఎక్కువని పేర్కొంది. కమర్షియల్‌‌‌‌ వెహికల్ సేల్స్‌‌‌‌ 59,497 యూనిట్ల నుంచి 13.52 శాతం పడిపోయి గత నెలలో 51,454 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రీ వీలర్స్ సేల్స్ అయితే డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 52.75 శాతం పడిపోయాయి. 20‌‌‌‌‌‌‌‌19, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 58,651 వెహికల్స్ అమ్ముడు కాగా, గత నెలలో 27,715 యూనిట్లకు ఈ సేల్స్ పడిపోయాయి.

passenger vehicle retail sales rise in this year

ట్రాక్టర్ల అమ్మకాలు 35.49 శాతం పెరిగి 51,004 యూనిట్ల నుంచి 69,105 యూనిట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి సారిగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో వెహికల్ రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్‌‌‌‌ వింకేష్‌‌‌‌ గులాటి చెప్పారు. పంటల దిగుబడి బాగుండడం, టూ వీలర్ సెగ్మెంట్‌‌‌‌ కొత్త ఆఫర్లతో ముందుకు రావడంతో సేల్స్ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్యాసెంజర్ వెహికల్‌‌‌‌, టూ వీలర్ సెగ్మెంట్లలో కొత్త వేరియంట్స్ పెరిగాయని తెలిపారు. సప్లయ్‌‌‌‌ సైడ్‌‌‌‌ సమస్యలు కొనసాగుతుండడంతో ప్యాసెంజర్ వెహికల్‌‌‌‌ సేల్స్‌‌‌‌పై నెగిటివ్‌‌‌‌ ప్రభావం పడుతోందని అన్నారు.

English summary

పెరిగిన వాహనాల విక్రయాలు.. కరోనా టైంలోనూ హై.. కారాణాలివే.. | passenger vehicle retail sales rise in this year

passenger vehicle retail sales rise in this year fada president vinkesh said
Story first published: Tuesday, January 12, 2021, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X