For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

70% పతనమైన బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్‌లో ఆందోళన

|

ప్రపంచ క్రిప్టో మార్కెట్ గత కొద్ది రోజులుగా దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. ఆల్ టైమ్ గరిష్టం నుండి మూడు నుండి నాలుగు రెట్లు పడిపోయిన వివిధ క్రిప్టోలు అదేస్థాయిలో గత కొద్దికాలంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు లాభనష్టాల మధ్య ఊగిసలాటలో ఉంది. నేడు కొన్ని క్రిప్టోలు లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో కదలాడుతున్నాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 4 శాతం, షిబా ఇను దాదాపు మూడు శాతం క్షీణించాయి. క్రిప్టో పతనం ఈ మార్కెట్‌కు ఆందోళన కలిగిస్తోంది.

బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 20,508 డాలర్ల వద్ద కనిష్టాన్ని, గత ఇరవై నాలుగు గంటల్లో 21,175 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి 20,746 డాలర్ల వద్ద కదలాడింది. నేడు బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 395 బిలియన్ డాలర్లు క్షీణించింది. 52 వారాల కనిష్టం 17,601 డాలర్లు కాగా, గరిష్టం 68,990 డాలర్లు. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం నుండి ఏకంగా 70 శాతం పతనమైంది.

 Panic Across Crypto Markets Spreading As Bitcoin Dives 70 percent

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 0.35 శాతం, ఎథేరియం 1.34 శాతం, బియాన్స్ కాయిన్ 3.24 శాతం, బియాన్స్ యూఎస్డీ 0.08 శాతం లాభపడగా, డోజీకాయిన్ 3 శాతం, షిబా ఇను 2.14 శాతం క్షీణించాయి. ఇక, టెర్రా యూఎస్డీ ఏకంగా 66 శాతం ఎగిసిపడింది. ఆ తర్వాత బిట్ టోరెంట్ 12 శాతం లాభపడింది. సింథెటిక్స్ 6 శాతం క్షీణించగా, కాస్మోస్ 5.25 శాతం పడిపోయింది.

English summary

70% పతనమైన బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్‌లో ఆందోళన | Panic Across Crypto Markets Spreading As Bitcoin Dives 70 percent

For a generation of alienated techies, crypto's all for one ethos was its biggest draw. Now panic is spreading across this universe and that same ethos is posing what may be the biggest threat yet to its survival.
Story first published: Tuesday, June 28, 2022, 20:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X