For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సమయంలో డిజిటలైజేషన్ వేగంగా పెరిగింది

|

కరోనా మహమ్మారి వల్ల భారత్‌లో డిజిటలైజేషన్ వేగవంతమైందని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) పేర్కొంది. ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయని వెల్లడించింది. శనివారం ఓ సెమినార్‌లో పాల్గొన్న NPCI సీవోవో ప్రవీణ్ రాయ్ డిజిటలైజేషన్ పుంజుకుందని తెలిపారు. అన్ని వర్గాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగమవుతున్నాయన్నారు. నిత్యం జీవితంలో ఇది భాగమైయిందన్నారు.

నగదు ట్రాన్సాక్షన్స్ నుండి క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు పడుతున్నాయన్నారు. ప్రజలు, కస్టమర్లు, వ్యాపారులు కూడా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. QR కోడ్ వల్ల యూపీఐ చెల్లింపులు పెరిగాయన్నారు. దీనికి తోడు రివార్డు ప్రోగ్రామ్స్ వల్ల డిజిటల్ వైపు ప్రజలు అడుగు వేయడానికి ఓ కారణమని తెలిపారు. చాట్‌బోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల చెల్లింపు సమస్యలు కూడా సత్వరమే పరిష్కారమవుతాయన్నారు.

Pandemic increased momentum of digitisation: NPCI COO

డిజిటలైజేషన్ కారణంగా ప్రజల్లే సేవింగ్స్ అలవాటు కూడా పెరిగిందన్నారు. డిజిటలైజేషన్ అందరి జీవితాల్లోను విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందని, ఆన్‌బోర్డింగ్ గణనీయంగా పెరిగిందన్నారు. లాక్ డౌన్ సమయంలో యూపీఐ అడాప్షన్ తగ్గిందని తెలిపారు.

English summary

కరోనా సమయంలో డిజిటలైజేషన్ వేగంగా పెరిగింది | Pandemic increased momentum of digitisation: NPCI COO

National Payments Corporation of India (NPCI), an umbrella body for retail payments and settlement, said on Saturday that the pandemic has increased the momentum of digitisation in the country.
Story first published: Sunday, December 13, 2020, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X