For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్-ఆధార్ లింకింగ్ గడువు మరోసారి పొడిగింపు, ఎప్పటి వరకు అంటే?

|

కేంద్ర ఆర్థిక శాఖ పాన్ కార్డు నెంబర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకునే గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకు గడువు ఈ రోజుతో (మార్చి 31)తో ముగుస్తోంది. అయితే కేంద్రం తాజాగా ఈ గడువును మార్చి 31, 2021 వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారికి ఇది పెద్ద ఊరట. కొంతమంది వద్ద ఒకటి కన్న ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయి. ఎవరైనా రెండు పాన్ కార్డులు ఉపయోగిస్తే వాటిలో ఒకదానిని ఇన్-ఆపరేటివ్ చేసుకోవాలి. ఒక దానిని ఉపయోగించాలి.

జరిమానా నుండి ఊరట

జరిమానా నుండి ఊరట

ఇదివరకు గడువు అయితే పాన్-ఆధార్ లింక్ గడువు నేటితో ముగియాలి. ఆ తర్వాత రూ.500-రూ.1000 వరకు జరిమానా ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 30 వరకు అనుసంధానం చేస్తే రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1000 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. మార్చి 31 తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ ఇన్-యాక్టివేట్‌గా మారుతాయని పేర్కొంది. పైన పేర్కొన్న జరిమానాను చెల్లించి అనుసంధానం చేస్తే తిరిగి పని చేస్తాయని తెలిపింది. కానీ ఈ జరిమానాలు అన్నింటి నుండి ఊరట కలిగించేలా తాజా ప్రకటన వచ్చింది. లింకింగ్ గడువును మరో ఏడాది పొడిగించారు.

ఇలా లింక్

ఇలా లింక్

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి, రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబర్ మీ యూజర్ ఐడీ అవుతుంది. యూజర్ ఐడీ, పాస్ వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగ్-ఇన్ కావాలి. ఆధార్-పాన్ లింక్ కోసం ఓ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది. స్క్రీన్ పైన పాన్ కార్డు వివరాలను ఆధార్‌లో పేర్కొన్న వివరాలతో ధృవీకరించాలి. (ఏవైనా తేడాలు ఉంటే సరి చేసుకోవాలి.) ఆ తర్వాత వివరాలు సరిపోతే మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి లింక్ నౌ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్, పాన్ కార్డుతో విజయవంతంగా లింక్ అయినట్లు పాప్-ఆప్ విండోతో సందేశం వస్తుంది. ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో కనిపిస్తున్న లింక్ ఆధార్ పైన క్లిక్ చేసి, అనుసంధానం చేసుకోవచ్చు.

ఈ సేవలు పొందాలంటే

ఈ సేవలు పొందాలంటే

బ్యాంకింగ్ సేవలు పొందడం కోసం, డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, ఆన్‌లైన్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందడానికి మీ పాన్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లేదంటే ఈ సేవలకు ఇబ్బందులు కలగవచ్చు. దీంతో పాటు మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి వచ్చే వడ్డీ, డివిడెండ్, ఇతర ఆదాయాలపై అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశముంది.

English summary

పాన్-ఆధార్ లింకింగ్ గడువు మరోసారి పొడిగింపు, ఎప్పటి వరకు అంటే? | PAN-Aadhaar Linking Deadline Extended Till March 31, 2023

The Ministry of Finance has extended the deadline for linking PAN Card with Aadhaar number till March 31, 2023. The deadline was otherwise set to end.
Story first published: Thursday, March 31, 2022, 9:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X