For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతికి రూ.లక్షలు: బీఎస్ఎన్ఎల్ VRSకు 94,000 ఉద్యోగులు దరఖాస్తు

|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి (VRS) ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 94,000 మందికి పైగా ఉద్యోగులు వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్‌లో వీఆర్ఎస్‌కు అర్హులైన వారు లక్ష మంది వరకు ఉన్నారు. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో వీరిది మూడింట రెండు వంతులు ఉంటుంది.

BSNL వీఆర్ఎస్! దరఖాస్తు తేదీ, అర్హులు: 58 ఏళ్లకే రిటైర్మెంట్?BSNL వీఆర్ఎస్! దరఖాస్తు తేదీ, అర్హులు: 58 ఏళ్లకే రిటైర్మెంట్?

94 వేల మందికికి పైగా వీఆర్ఎస్

94 వేల మందికికి పైగా వీఆర్ఎస్

ఈ ఉద్యోగుల్లో 94 వేల మందికి పైగా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ పథకం డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణలో భాగంగా వీఆర్‌ఎస్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత పథకం కింద వీఆర్‌ఎస్ ప్రభావిత తేదీ వచ్చే ఏడాది జనవరి 31వ తేదీగా ఉంది.

ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.90 లక్షల వరకు వచ్చే అవకాశం

ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.90 లక్షల వరకు వచ్చే అవకాశం

70 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే వేతన భారం దాదాపు రూ.7 వేల కోట్ల వరకు తగ్గుతుందని అంచనా. ఎంటీఎన్ఎల్ కలుపుకుంటే మరింత తగ్గనుంది. ఈ రెండు సంస్థల రుణ భారం రూ.40వేల కోట్లకు పైగా ఉంది. వీఆర్ఎస్ పథకం ద్వారా సర్వీసు, వేతనాన్ని బట్టి ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.90 లక్షల వరకు లభించే అవకాశముందట. దీంతో చాలామంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వీఆర్ఎస్ ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఎంటీఎన్ఎల్‌లోను అనూహ్య స్పందన

ఎంటీఎన్ఎల్‌లోను అనూహ్య స్పందన

ఎంటీఎన్ఎల్‌లోనూ ఇప్పటికే 14,000 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం 13,500 టార్గెట్‌గా పెట్టుకోగా, దానిని మించిపోయింది. ఇప్పటి దాకా 13,998 మంది వరకు వీఆర్ఎస్ తీసుకున్నారని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 18,200గా ఉందని, వీరిలో 16,372 మంది వీఆర్ఎస్ పథకానికి అర్హులు అని ఎంటీఎన్ఎల్ చైర్మన్ చెప్పారు.

అందుకే అనూహ్య స్పందన

అందుకే అనూహ్య స్పందన

మరోవైపు, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం ఈ VRS స్కీంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. యాజమాన్యం భయపెట్టి ఉద్యోగుల చేత వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 58కి తగ్గిస్తారని, వీఆర్ఎస్ తీసుకోని 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదలీ చేస్తారని చెబుతున్నారని అంటున్నారు. అయితే వీఆర్ఎస్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉండటంతో ఉద్యోగులు దానికే మొగ్గు చూపుతున్నారని, అందుకే అనూహ్య స్పందన వస్తుందనేది కొందరి వాదన.

English summary

చేతికి రూ.లక్షలు: బీఎస్ఎన్ఎల్ VRSకు 94,000 ఉద్యోగులు దరఖాస్తు | Over 94,000 employees of BSNL and MTNL opt for VRS scheme

Over 94,000 employees of state-run BSNL and MTNL have so far opted for the recently announced VRS scheme, according to a government source.
Story first published: Tuesday, November 26, 2019, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X