For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Recession: ఆర్థిక మాంద్యంపై నోమురా సంచలన రిపోర్ట్.. భారత్‌కు ఏమవుతుంది?.. మనం సేఫేనా?

|

Recession: రష్యా-ఉక్రెయిన్ వివాదం నెలల తరబడి సాగుతుండగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండవచ్చని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సర కాలంలో చాలా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు రికవరీలో మందగమనాన్ని చూడవచ్చని నిపుణులు హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా ఉండవచ్చని నోమురా హోల్డింగ్స్ సంస్థ అంచనా వేసింది.

బ్రోకరేజ్ మాటేంటి..

బ్రోకరేజ్ మాటేంటి..

బ్రోకరేజ్ సంస్థ అంచనాల ప్రకారం.. ఇంగ్లండ్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అనేక దేశాలు మాంద్యాన్ని చేరుకోవచ్చు. సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.., ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీని వల్ల ఎకానమీలో నగదు ప్రవాహం మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాయి.

అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు..

అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు..

వడ్డీ రేట్ల పెంపు వల్ల ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో వడ్డీ రేటు మరింతగా పెరగడం కొనసాగవచ్చని తెలుస్తోంది. తద్వారా వృద్ధిపై తక్కువ ఫోకస్ ఉంచవచ్చు. ఇది ఆర్థిక వృద్ధిపై మరింత బలమైన ప్రభావాన్ని చూపనుంది.

అమెరికా పరిస్థితి..

అమెరికా పరిస్థితి..

ఈ మాంద్యం రేటు దేశం నుంచి దేశానికి మారవచ్చు. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రారంభమై ఐదు త్రైమాసికాల్లో విస్తరించి యూఎస్‌లో నిస్సారమైన దీర్ఘకాలిక పునరుద్ధరణ ఉండవచ్చని నోమురా అంచనా వేసింది. అంటే రానున్న ఏడాది కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేయనుంది.

యూరప్ సంగతేంటి..

యూరప్ సంగతేంటి..

ఐరోపా అంతటా రష్యా గ్యాస్ షట్డౌన్ పరిణామాలు భయంకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో జపాన్ ఆర్థిక సంస్థ నోమురా 2023లో US, యూరోజోన్ ఆర్థిక వ్యవస్థలు 1 శాతం మేర కుదించబడతాయని అంచనా వేసింది.

మధ్యస్థ ఆర్థిక వ్యవస్థల స్థితి..

మధ్యస్థ ఆర్థిక వ్యవస్థల స్థితి..

ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియాతో సహా మధ్య తరహా ఆర్థిక వ్యవస్థల కోసం.. అధిక వడ్డీ రేట్లు అంచనా కంటే లోతైన మాంద్యాన్ని కలిగిస్తాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 2.2% క్షీణత ఉండనుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే.. జపాన్‌లో కూడా ఆర్థిక మందగమనం స్వల్పంగా ఉండవచ్చు.

చైనా పరిస్థితి..

చైనా పరిస్థితి..

అదే చైనా విషయానికి వస్తే.. జీరో కోవిడ్ విధానాన్ని అనుసరించినంత కాలం, అక్కడి వృద్ధిపై కూడా ప్రభావం ఉండవచ్చు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశం ఉంది. సరుకుల ధరలు పెరగడమే కాకుండా అద్దె ఖర్చులు, కూలీ ఖర్చులు కూడా పెరిగాయి. టెస్లా వంటి దిగ్గజ కంపెనీ సైతం చైనాలో తన గిగా ఫ్యాక్టరీ మూతపడటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

భారతదేశం..

భారతదేశం..

ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉండగా.. భారత్‌కు ఈ విషయంలో ఎలాంటి హెచ్చరికలు ఉండకపోవచ్చనేది కొంత ఊరటనిస్తోంది. పైగా మన ఆర్థిక వ్యవస్థ 2008 నాటి మాంద్యాన్ని తట్టుకున్న అనుభవం కలిగి ఉంది. ఇవి మనల్ని తక్కువ ప్రభావంతో బయట పడేయవచ్చని కొందరు భావిస్తున్నారు. దీనిపై బ్లూమ్ బర్గ్ నిర్వహించిన సర్వేలో ఊరటనిచ్చే రిజల్ట్ వచ్చింది.

English summary

Recession: ఆర్థిక మాంద్యంపై నోమురా సంచలన రిపోర్ట్.. భారత్‌కు ఏమవుతుంది?.. మనం సేఫేనా? | other than indian economy many western and european countries to face severe financial crisis in coming year as nomura reported

western and european countries to face severe financial crisis
Story first published: Monday, July 11, 2022, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X