For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ ఫుడ్: మరీ ఆ స్థాయిలో డిస్కౌంట్లా? నాణ్యత సంగతేంటి?

|

ఆకలేస్తోందా? బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఏదైనా సరే ఇప్పుడు మీ ముందుకే వచ్చి వాలిపోతుంది. జస్ట్ మొబైల్ నుంచి ఆర్డర్ చేస్తే చాలు వెజ్, నాన్ వెజ్, ఫాస్ట్‌ఫుడ్.. ఏ రకం ఆహార పదార్థాలైనా సరే.. అరగంటలో మీ ముందు ఉంటాయి. ఇంట్లోగాని, ఆఫీసులోగాని మీరు కూర్చున్న చోట నుంచి కదలాల్సిన అవసరమే లేదు. అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం రెడీ!

అంతేకాదు, ఆకలేసినప్పుడు ఏ హోటల్‌కో, రెస్టారెంటుకో వెళితే.. మెనూకార్డ్ లోని ధరల ప్రకారం.. మీరు ఆయా ఆహార పదార్థాలకు మొత్తం డబ్బు చెల్లించాల్సిందే. నో డిస్కౌంట్స్. అవే పదార్థాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ! అసలు ఈ స్థాయిలో డిస్కౌంట్లు సాధ్యమేనా? ఆ ఆహారం నాణ్యమైనదేనా? అన్న ఆలోచన ఎప్పుడైనా, ఎవరికైనా వచ్చిందా?

వంట.. అబ్బ అదో పెద్ద బాధ్యత!

వంట.. అబ్బ అదో పెద్ద బాధ్యత!

ఒకప్పుడు వంట చేయడం అంటే.. అదో పెద్ద పని. గృహిణులకు అదో పెద్ద బాధ్యత. దానికోసమే పుట్టినట్లుగా.. ఉదయం అల్పాహారం చేయడం, పిల్లలకు బాక్సులు కట్టి పంపడం.. ఆపైన క్యారియర్ కట్టి శ్రీవారిని ఆఫీసుకు సాగనంపడం.. ఇవన్నీ అయ్యేసరికి ఉదయం 11 గంటలు. ఇక అప్పుడు మధ్యాహ్నం లంచ్‌లోకి ఏమేం చేయాలో ఆలోచించుకోవడం.. తరువాత ఆ పనిలో పడిపోవడం. మళ్లీ సాయంత్రం పిల్లలు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి వారికి వేడివేడిగా స్నాక్స్ సిద్ధం చేసి పెట్టడం, తిరిగి రాత్రికి మళ్లీ వంట చేయడం.. అబ్బో.. రోజంతా అదే యావ.. అదే పని.. జీవితంలో ఇంకేమీ లేనట్లు.

ఫ్యాషన్‌గా మారిన ఫుడ్ ఆర్డరింగ్...

ఫ్యాషన్‌గా మారిన ఫుడ్ ఆర్డరింగ్...

కానీ ఇప్పుడలా కాదు. ఏది కావాలంటే అది.. జస్ట్ సెల్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే చాలు.. అరగంటలో డెలివరీ బోయ్ ఇంటి గుమ్మం ముంగిట ప్రత్యక్షమవుతాడు. దీంతో రోజంతా వంటకు సంబంధించిన చాకిరీ తప్పుతుంది.. జిహ్వ చాపల్యమూ తీరిపోతోంది. ఇక బయటికి వెళ్లినప్పుడల్లా రెస్టారెంట్లు, హోటళ్లు ఉండనే ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఏదైనా సరే కూర్చున్న చోటికే వచ్చేస్తోంది. జస్ట్ మొబైల్ నుంచి ఆర్డర్ చేస్తే చాలు వెజ్, నాన్ వెజ్, ఫాస్ట్‌ఫుడ్.. ఏ రకం ఆహార పదార్థాలైనా సరే.. అరగంటలో మన ముందు ఉంటాయి. ఇంట్లోగాని, ఆఫీసులోగాని మీరు కూర్చున్న చోట నుంచి కదలాల్సిన అవసరమే లేదు. అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం! దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్‌లో మారిపోయింది.

ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల ఎర...

ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల ఎర...

బయటికెళ్లి ఏ రెస్టారెంటులోనో, హోటల్లోనో తింటే.. అక్కడికి వెళ్లడానికి అయ్యే ఖర్చుతోపాటు అక్కడి మెనూకార్డులోని రేట్ల ప్రకారం డబ్బులు చెల్లించాల్సిందే. అదే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటే.. సమయం కలిసి వస్తుంది. పైగా బోలెడు ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా. అవును, భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు చాలా వరకు డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీంతో నగరాల్లో ఉండే ప్రజానీకం చాలామటుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికే మక్కువ చూపుతున్నారు. ఒక్కో రెస్టారెంటులో ఒక్కో రకమైన ఆఫర్లు. 10, 20,30, 40, 50 శాతం డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటున్నాయి. కొన్ని యాప్స్ బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి.

మరి, నాణ్యత సంగతేంటి?

మరి, నాణ్యత సంగతేంటి?

అయితే ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా ఇంటికి డెలివరీ అవుతోన్న ఆహార పదార్థాలు నాణ్యమైనవేనా? అసలు 50 శాతం డిస్కౌంటు, బై వన్ గెట్ వన్ వంటి ఆఫర్లు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇవీ ప్రస్తుతం చాలామంది మదిలో మెదులుతోన్న ఆలోచనలు. ఆ రోజు వండిన ఆహార పదార్థాలనే రిఫ్రిజిరేటర్‌లో పెట్టి మర్నాడు వాటినే వేడి చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లలో సీల్ చేసి పంపితే.. కస్టమర్లు ఎంత మంది ఆ ఆహార పదార్థాల నాణ్యతను గుర్తించగలుగుతారు? ఇక డెలివరీ బాయ్‌ల చేతివాటం గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. మరొక సంగతేమిటంటే.. రెస్టారెంటు, హోటళ్లలో తాజాగా వండిన ఆహార పదార్థాలకు, ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా పొందిన ఆహార పదార్థాలకు నాణ్యత విషయంలో చాలా తేడా ఉంటోందని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు వారు ఆయా రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు జరిపినప్పుడు కూడా కుళ్లిన, చెడిపోయిన ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి. కాబట్టి ఆహార పదార్థాలకు సంబంధించి ఆన్‌లైన్ ఆర్డర్ల విషయంలో జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం.

Read more about: hotels restaurants
English summary

ఆన్‌లైన్ ఫుడ్: మరీ ఆ స్థాయిలో డిస్కౌంట్లా? నాణ్యత సంగతేంటి? | ordering food online.. discounts ok.. but what about quality

Everyone likes to order food online now a days. By using mobile and some apps people can get delicious food items from prominent hotels and restaurants. Moreover the apps also giving promotional offers, discounts on various food items apart from free home delievery.
Story first published: Tuesday, November 19, 2019, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X