For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Cylinder Rates: భారీగా తగ్గిన వంటగ్యాస్ ధర.. నవంబర్ 1 నుంచి మారిన రేట్లు..

|

LPG Cylinder Rates: ప్రతిసారి లాగానే ఈనెల 1న కూడా దేశంలోని చమురు కంపెనీలు తమ వంటగ్యాస్ ధరలో మార్పులు చేశాయి. వినియోగదారులకు దీనివల్ల స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవాలి.

మారిన ధరలు..

మారిన ధరలు..

ద్రవ్యోల్బణంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు నవంబర్ మొదటి తేదీన ఇంధన కంపెనీలు శుభవార్త చెప్పాయి. తాజా సమీక్ష తర్వాత కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల రేట్లను మార్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్లపై ఏకంగా రూ.115.50 తగ్గించాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దేశంలో జూలై నెల నుంచి ఇప్పటి వరకు వీటి ధరలను చమురు కంపెనీలు మార్చకుండా స్థిరంగా కొనసాగిస్తున్నాయి.

మెట్రో నగరాల్లో రేట్లు..

మెట్రో నగరాల్లో రేట్లు..

ఢిల్లీలో 19 కిలోల ఇండియన్ గ్యాస్ సిలిండర్ కొత్త ధర ఇప్పుడు రూ.1,744గా ఉండగా.. గతంలో రూ.1859.50గా ఉండేది. ముంబై నగరంలో కమర్షియల్ సిలిండర్ల ధరలు మారిన తర్వాత రూ.1,696కి చేరుకున్నాయి. చెన్నై నగరంలో సిలిండర్ ధర రూ.1,893కి చేరుకోగా.. కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,846కి చేరుకున్నాయి.

14.2 కిలోల సిలిండర్ తాజా ధరలు..

14.2 కిలోల సిలిండర్ తాజా ధరలు..

ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,053గా ఉంది. కోల్‌కతాలో రూ.1,079, చెన్నైలో 1,068.50, ముంబైలో రూ.1,052కు గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు ధరలను తగ్గించక పోవటంతో గృహ వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణ సమయంలోనూ తమకు ఎలాంటి ఊరటను కేంద్ర ప్రభుత్వం కల్పించటం లేదని అంటున్నారు.

గతంలో తగ్గింపులు ఇలా..

గతంలో తగ్గింపులు ఇలా..

జూలైలో సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూన్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. ఆగస్టులో రూ.36, సెప్టెంబర్ మాసంలో రూ.100, అక్టోబర్ నెలలో రూ.25.50 తగ్గింపు వచ్చింది. నవంబర్ నెలలో కంపెనీలు రూ.115.50 తగ్గింపు ప్రకటించటంతో.. మెుత్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధర రూ.619 తగ్గింది. ఇది కమర్షియ సిలిండర్ వినియోగదారులకు పెద్ద ఊరట.

English summary

LPG Cylinder Rates: భారీగా తగ్గిన వంటగ్యాస్ ధర.. నవంబర్ 1 నుంచి మారిన రేట్లు.. | Oil companies redduced Commercial Cylinder Rtes by 115.50 Rupees in November 2022

Oil companies redduced Commercial Cylinder Rtes by 115.50 Rupees in November 2022
Story first published: Tuesday, November 1, 2022, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X