వడ్డీ నుండి హోమ్‌లోన్ వరకు, డిస్కౌంట్స్..: కస్టమర్లకు ICICI బ్యాంకు బంపరాఫర్స్
పండుగ సమయమలో ICICI బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది. మొన్న ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), నిన్న HDFC ఫెస్టివెల్ ఆఫర్లు ప్రకటించగా, ఇప్పుడు ప్రయివేటురంగ మరో దిగ్గజం ICICI ఆఫర్లు ప్రకటించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు హోమ్ లోన్, గోల్డ్ లోన్, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్.. ఇలా వివిధ ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తోంది. ఐసీఐసీఐ హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్, వినిమయ రుణాలపై పండుగ బొనాంజాను ప్రకటించింది. పండుగ ఆఫర్లు కొన్ని అక్టోబర్ 1వ తేదీ నుండి ప్రారంభం కాగా, మరికొన్ని ఉత్పత్తులు వివిధ తేదీల్లో ప్రారంభమవుతున్నాయి.
పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్

హోమ్ లోన్, ఆటో లోన్ ఆఫర్
హోమ్‌లోన్, ఇతర బ్యాంకుల నుంచి రుణాల బదిలీపై కనిష్టంగా 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజును తక్కువగా రూ3,000 నుంచి వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
పండగ సమయంలో సొంత వాహనం కొనుగోలు చేసేవారికి వెసులుబాటుతో కూడిన ఈఎంఐ ప్రకటించింది. 84 నెలల కాలపరిమితిలో లక్ష రూపాయలకు కేవలం రూ.1,554 నుంచి ఈఎంఐలు ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు మహిళా కస్టమర్లకు కనిష్టంగా 1,999 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిపింది.
టూ-వీలర్ కొనుగోలు చేసేవారికి రూ.1,000 పైన అతితక్కువ రూ.36 ఈఎంఐ ఇస్తోంది. ఇది 36 నెలల కాలపరిమితి పైన అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.999 మాత్రమే.

వడ్డీ రేట్లు.. నో కాస్ట్ ఈఎంఐ
- వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ పైన 10.50 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు రూ.3,999.
- వివిధ బ్రాండ్స్, హోమ్ అప్లియెన్స్, డిజిటల్ ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది.
- మినిమం డాక్యుమెంటేషన్‌తో త్వరగా, డిజిటల్‌గా పూర్తవుతుంది.

డిస్కౌంట్.. క్యాష్ బ్యాక్
ఫెస్టివ్ బొనాంజా పేరుతో పలు డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌ను బ్యాంక్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులపై వినిమయ రుణాలపై నో కాస్ట్ ఈఎంఐని ఆఫర్ చేస్తోంది. ఫెస్టివ్ బొనాంజా కింద ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్, వాణిజ్య కస్టమర్లకు కూడా పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.
ఎలక్ట్రానిక్స్,గాడ్జెట్, అప్పారెల్స్, జ్యువెల్లరీ, హెల్త్, గ్రాసరీ, ఫుడ్ ఆర్డరింగ్, ఆటోమొబైల్స్, ఫర్నీచర్, వినోదం, ఈ-లర్నింగ్ వంటి వాటి పైన వివిధ ఆఫర్లు ఉన్నాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, జొమాటో, స్విగ్గీ, పెప్పర్‌ఫ్రై, టీబీజెడ్‌లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఉంటుంది.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్.. దేనినైనా ఉపయోగించి ఆఫర్లు పొందవచ్చు.