ఫోర్బ్స్ జాబితా... భారత PSUల్లో అత్యుత్తం ఎన్టీపీసీ
ప్రభుత్వరంగ దిగ్గజ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ మరో ఘనత సాధించింది. ఫోర్బ్స్ పత్రిక ఈ ఏడాది ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలతో రూపొందించిన జాబితాలో భారత ప్రభుత్వరంగ కంపెనీ(PSU)లలో ఎన్టీపీసీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో తమకు గల నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనమని ఎన్టీపీసీ తెలిపింది. ఎన్టీపీసీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులు 1,60,000 మంది ఉన్నారు. 58 దేశాల్లో వర్క్ చేస్తున్నారు.
కోవిడ్ 19 నేపథ్యంలో కంపెనీల స్పందన, ఆ కంపెనీల ప్రాముఖ్యత, ఎకనమిక్ ఫుట్ ప్రింట్, టాలెంట్ డెవలప్‌మెంట్, జెండర్ ఈక్వాలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి వాటిన పరిగణలోకి తీసుకున్నారు. 45 దేశాలలోని, 750 మల్టీ నేషనల్ కంపెనీలతో తుది జాబితాలను తయారు చేశారు.
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ అటాక్, ప్రపంచవ్యాప్తంగా ప్లాంట్స్ క్లోజ్: వ్యాక్సీన్ టార్గెట్?

ఈ జాబితాలో 247 కంపెనీలతో అమెరికా ముందు నిలిచింది. యూరోప్ నుండి 224 కంపెనీలు, ఆసియా, ఓసియానియా నుండి 208 కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల్లో సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్‌గా నిలిచింది. అమెజాన్, ఐబీఎం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఎల్జీ ఉన్నాయి. భారత్ నుండి 31 కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇదిలా ఉండగా, లైసెన్సింగ్ బిడ్డింగ్ దశలో మొత్తం 11 చమురు గ్యాస్ తవ్వక బ్లాకుల్లో ఏడు ఓఎన్జీసీకీ, నాలుగు ఆయిల్ ఇండియాకు దక్కాయి. ఈ మేరకు డీజీహెచ్ తెలిపింది. అయిదో దశ ఓఎల్ఏపీలో భాగంగా జూన్ 30 వరకు 12 బ్లాకులకు బిడ్డింగ్ నిర్వహించారు.