For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాక్యుమెంట్స్ లీక్: NSEపై మరోసారి ఆరోపణలు

|

అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)కి కొత్త చిక్కు వచ్చింది. డేటా లీకేజీకి సంబంధించి ఎక్స్ఛేంజ్ పైన క్యాపిటల్ మార్కెట్ నియంత్రణాధికార సంస్థ (SEBI) దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంపై ఎక్స్ఛేంజ్‌కు గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన SEBI తాఖీదులు పంపించింది. ఈ కేసులో తనిఖీలు జరిపేందుకు సంబంధిత పత్రాలను సమర్పించాలని ఎక్స్ఛేంజ్ ఉన్నతాధికారులను ఆదేశించింది.

NSE మాజీ ఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణ హయాంలో 2011-15 మధ్యకాలంలో పత్రాలు లీకులు అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సెక్యూరిటీస్ అప్పీలెంట్ ట్రైబ్యునల్ (SAT)లోని తన సర్వర్లను ఉపయోగించుకునేలా కొన్ని కంపెనీలకు, ట్రేడర్లకు వీలుకల్పించిన ఆరోపణలపై NSEపై సెబి చర్యలు తీసుకుంది. ఇప్పుడు మరో చిక్కు వచ్చింది.

సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టు నోటీసులు, అదే పాయింట్ లాగిన టాటాసైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టు నోటీసులు, అదే పాయింట్ లాగిన టాటా

NSE under another Sebi probe, this time for document leaks

టెక్నికల్ అంశాలపై NSE తీసుకున్న కొన్ని విధాన పరమైన నిర్ణయాలకు చెందిన పత్రాలు, బోర్డు సమావేశాల వివరాలు ఆ పత్రాల్లో ఉన్నాయి. ఎక్స్చేంజీ నిర్వహించిన అంతర్గత సర్వేలు కూడా అందులో ఉన్నాయని చెబుతున్నారు. కాగా ఈ విషయమై ఎన్ఎస్ఈ స్పందించాల్సి ఉంది. కాగా, దీనిపై ఒక కన్సెంట్ పిటిషన్‌ను NSE దాఖలు చేసినట్లుగా కూడా చెబుతున్నారు.

English summary

డాక్యుమెంట్స్ లీక్: NSEపై మరోసారి ఆరోపణలు | NSE under another Sebi probe, this time for document leaks

India’s largest bourse National Stock Exchange (NSE) is facing a fresh regulatory probe. The Securities and Exchange Board of India (Sebi) is investigating an alleged leak of the exchange’s internal documents to brokers and market players, said three people privy to the development.
Story first published: Sunday, January 12, 2020, 7:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X