ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు కూడా రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు పని చేయాలనే చర్చ మొదలైంది. ఇటీవల గిఫ్ట్ ఐఎఫ్ఎస్ సీ (GIFT IFSC) ఆధ్వర్యంలో జరిగిన 'గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కాన్క్లేవ్ 2.0'లో ప్రపంచ స్థాయి ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX), చికాగో మెర్కాంటైల్ ఎక్స్ఛేంజ్ (CME), యురెక్స్ (Eurex) వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ చర్చలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టెక్నాలజీ ఉంది.. కానీ డిమాండ్ లేదు!
సిఎమ్ఈ గ్రూప్ ఎండి రసెల్ బీటీ , ఎస్జీఎక్స్ ప్రెసిడెంట్ మైఖేల్ సిన్ అభిప్రాయం ప్రకారం.. సాంకేతికంగా స్టాక్ మార్కెట్‌ను 24 గంటలూ నడపడం అసాధ్యమేమీ కాదు. కానీ, అసలు సమస్య మార్కెట్ పార్టిసిపెంట్స్ నుంచి వస్తోంది. ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డిమాండ్ సరిపోదని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం సింగపూర్ ఎక్స్ఛేంజ్ , యురెక్స్ రోజుకు 21 గంటల పాటు పని చేస్తున్నాయి. మన దేశంలోని ఎన్ఎస్ఈ (NSE), బిఎస్ఈ (BSE) మాత్రం ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గిఫ్ట్ సిటీలోని ఎక్స్ఛేంజీలు మాత్రం దాదాపు 21 గంటల పాటు ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.
వీకెండ్ ట్రేడింగ్ సాధ్యమేనా?
రసెల్ బీటీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో 23x5 (వారానికి ఐదు రోజులు, రోజుకు 23 గంటలు) మోడల్‌తో పాటు వీకెండ్ యాక్సెస్ కూడా ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
- మెయింటెనెన్స్: శనివారం ఉదయం కొన్ని గంటల పాటు మెయింటెనెన్స్ కోసం మార్కెట్ క్లోజ్ అవుతుంది.
- సెటిల్మెంట్: వీకెండ్‌లో జరిగే ట్రేడింగ్‌కు సంబంధించి సోమవారం సెటిల్మెంట్ చేసే పద్ధతిని తీసుకురావచ్చు. అయితే, ఫిజికల్ మార్కెట్లు (Cash Markets) ఓపెన్ కాకుండా డెరివేటివ్స్ మార్కెట్లను ఓపెన్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇన్వెస్టర్లు ఎందుకు వద్దంటున్నారు?
మైఖేల్ సిన్ (SGX) ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు 24 గంటల మార్కెట్‌ను కోరుకోవడం లేదట.
- రికాన్సిలియేషన్: రోజు చివరలో అకౌంట్స్ సరిచూసుకోవడానికి, పేపర్ వర్క్ పూర్తి చేయడానికి సమయం కావాలి. మార్కెట్ నిరంతరం నడుస్తూ ఉంటే ఈ ప్రక్రియ కష్టమవుతుంది.
- క్రెడిట్ రిస్క్: బ్యాంకులు సాధారణంగా వీకెండ్స్ , రాత్రి సమయాల్లో పని చేయవు. నగదు బదిలీలు (Settlements) జరగకుండా ట్రేడింగ్ చేయడం వల్ల సిస్టమ్‌లో క్రెడిట్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది.
- ఆలోచించే సమయం: ఏదైనా పెద్ద వార్త బయటకు వచ్చినప్పుడు, ఇన్వెస్టర్లు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అవసరమని యురెక్స్ ప్రతినిధి స్టెఫాన్ ఉల్రిచ్ అన్నారు.
భారతదేశంలో కూడా ట్రేడింగ్ సమయాన్ని పెంచాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ, విదేశీ మార్కెట్ల అనుభవం ప్రకారం.. కేవలం సమయం పెంచడం వల్ల మార్కెట్ అభివృద్ధి చెందదు. టెక్నాలజీతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ, ఇన్వెస్టర్ల అవసరాలు , తగినంత డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే 24x7 స్టాక్ మార్కెట్ (Stock Market) కల సాకారమవుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications