For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Byju's: బైజూస్ బెదిరిస్తోందంటున్న తల్లిదండ్రులు.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్..

|

Byju's: దేశీయ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ బైజూస్ పేరు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ఇప్పుడు చాలా పెద్ద వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది. బైజూస్ సంస్థ పిల్లల ఫోన్ నంబర్లను కొనుగోలు చేస్తోందని.. వాటి ద్వారా తల్లిందండ్రులకు కాల్ చేసి బెదిరిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే బైజూస్ కంపెనీ కొన్న ఫోన్ నంబర్లను వినియోగించి తమ కోర్సులను కొనమని ఆకర్షిస్తోందని, ఒక వేళ తిరస్కరిస్తే.. వారి తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థలు కథనాన్ని ప్రచురించాయి. కోర్సులను కొనుగోలు చేయకపోతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని బెదిరిస్తుందని ఆరోపించినట్లు తెలుసుకున్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) వెల్లడించింది.

 NPCPCR serious over allegations on Byjus threating students parents going viral

NCPCR చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను బైజూస్ సంస్థ కొనుగోలు చేసి బెదిరింపులతో వేదిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై బైజూజ్ సీఈవో బైజు రవీంద్రన్‌కు ఈ వారం ప్రారంభంలో కమిషన్ సమన్లు ​​పంపింది. దీనిపై రవీంద్ర డిసెంబర్ 23న NPCPCR ముందు ప్రత్యక్షంగా హాజరై సేల్స్ టీమ్ ఇబ్బందులకు గురిచేస్తుందన్న ఆరోపణలపై స్వయంగా వివరణ ఇవ్వాల్సి ఉంది.

నాన్ రిఫండబుల్ కోర్సుల కోసం లోన్-ఆధారిత ఒప్పందాలను నమోదు చేసుకునేలా బైజు కస్టమర్లను మోసగించిందని వార్తలు వచ్చాయి. కొంతమంది కస్టమర్లు తాము దోపిడీకి గురవుతున్నట్లు ఇచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని లేని పక్షంలో తదుపరి పరిణామాలను దుర్కోవాల్సి ఉంటుందని రవీంద్రన్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది.

Read more about: byjus npcpcr trending business news
English summary

Byju's: బైజూస్ బెదిరిస్తోందంటున్న తల్లిదండ్రులు.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్.. | NPCPCR serious over allegations on Byju's threating students parents going viral

NPCPCR serious over allegations on Byju's threating students parents going viral
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X