For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LICకి డిఫాల్టర్స్ షాక్, ఐదేళ్లలో ఎన్పీఏలు రెండింతలు

|

బీమా రంగంలో ఉన్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) సురక్షిత ప్రభుత్వ సెక్యూరిటీలు చేయడం, ప్రభుత్వరంగ సంస్థలను, బ్యాంకులను బెయిలవుట్ చేయడం తెలిసిందే. ఎల్ఐసీ ఆస్తులు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇటీవల పెద్ద మొత్తంలో లోన్ తీసుకొని బ్యాంకులకు ఎగవేయడం తెలిసిందే. బ్యాంకుల ఎన్పీఏలు పెరుగుతున్నాయి.

ఏ బ్యాంక్ కస్టమర్‌కైనా కార్డు లేకుండా ICICI ఏటీఎం నుంచి నగదు, ఇలా తీసుకోండిఏ బ్యాంక్ కస్టమర్‌కైనా కార్డు లేకుండా ICICI ఏటీఎం నుంచి నగదు, ఇలా తీసుకోండి

ఎల్ఐసీ డిఫాల్టర్లు డబుల్

ఎల్ఐసీ డిఫాల్టర్లు డబుల్

అయితే ప్రభుత్వరంగ ఎల్ఐసీకి కూడా ఎన్పీఏల బాధ తప్పడం లేదు. గత అయిదేళ్లలో ఎల్ఐసీ ఎన్పీఏలు రెండింతలు పెరిగి రూ.30,000 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి 6నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) ఎల్ఐసీ గ్రాస్ ఎన్పీఏలు 6.10 శాతంగా ఉన్నాయి. వివిధ కారణాలతో ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల ఎన్పీఏలు కూడా పెరుగుతున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్‌లో యస్ బ్యాంకు ఎన్పీఏలు 7.39 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంకు ఎన్పీఏలు 6.37 శాతానికి, యాక్సిస్ బ్యాంకు ఎన్పీఏలు 5.03 శాతానికి చేరుకున్నాయి.

రూ.30,000 కోట్ల ఎన్పీఏలు

రూ.30,000 కోట్ల ఎన్పీఏలు

ఎల్ఐసీ ఆస్తులు రూ.36 లక్షల కోట్లకు పైగా ఉంటాయి. ఈ సంస్థకు 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్‌కు ఎన్పీఏలు రూ.30,000కోట్లు ఉన్నాయి. గ్రాస్ ఎన్పీఏలు 6.10 శాతంగా ఉంది. అయిదేళ్లలో ఎన్పీఏలు దాదాపు రెండింతలు అయ్యాయి. ఎల్ఐసీ దాదాపు ఎప్పుడు గ్రాస్ ఎన్పీఏలును 1.5 శాతం నుంచి 2 శాతం మధ్య ఉండేలా చూసుకుంటుంది.

జాబితా ఇదే..

జాబితా ఇదే..

ఎల్ఐసీ బిగ్ డిఫాల్టర్స్ జాబితాలో డక్కన్ క్రానికల్, ఎస్సార్ పోర్ట్, గామన్, IL&FS, భూషణ్ పవర్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, అలోక్ ఇండస్ట్రీస్, అంత్రాక్ ఆటో, ఏబీజీ షిప్‌యార్డ్, యూనిటెక్, జీవీకే పవర్, జీటీఎల్ వంటివి ఉన్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ ప్రాఫిట్స్ ఏడాదికి రూ.2,600 కోట్ల వరకు ఉంటుంది.

English summary

LICకి డిఫాల్టర్స్ షాక్, ఐదేళ్లలో ఎన్పీఏలు రెండింతలు | NPA: LIC NPAs double to Rs 30,000 crore in 5 years

The big defaulters are the same as for banks. The names include Deccan Chronicle, Essar Port, Gammon, IL&FS, Bhushan Power, Videocon Industries, Alok Industries, Amtrak Auto, ABG Shipyard, Unitech, GVK Power and GTL etc. The LIC has both kinds of exposures - term loan and investment via NCDs - in many of these companies.
Story first published: Wednesday, January 22, 2020, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X