కరోనా వైరస్ దెబ్బతో క్రూడాయిల్ ధర తగ్గి ముఖేష్ అంబానీ ఆస్తులు సోమవారం ఒక్కరోజే 580 కోట్ల డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆసియా నెంబర్ వన్ కుబేరుడి స్థానం నుండి రెండో స్థానానికి దిగజారారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకులు జాక్ మా మళ్లీ నెంబర్ వన్‌గా నిలిచారు.

ముఖేష్ అంబానీయే కాదు.. జెఫ్ బెజోస్ కూడా..
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు రంగంలో కీలకంగా ఉండటంతో ఆయన పెద్ద మొత్తంలో నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా సోమవారం మరికొంతమంది కుబేరులు కూడా నష్టపోయారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, దాదాపు 7 బిలియన్ డాలర్లు కోల్పోయారు. అయితే ఆ తర్వాత 5.6 బిలియన్ డాలర్లతో కోలుకున్నారు.

బఫెట్, గేట్స్ సంపద ఎంత హరించుకుపోయిందంటే
బెర్క్‌షైర్ హాత్‌వేకు చెందిన వారెన్ బఫెట్ 5.3 బిలియన్ డాలర్లు కోల్పోయారు. బఫెట్ కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 18 బిలియన్ డాలర్లు కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంపద 5.1 బిలియన్ డాలర్లు కోల్పోయి 112 బిలియన్ డాలర్ల నుండి 106 బిలియన్ డాలర్లకు తగ్గింది.

239 బిలియన్ డాలర్లు హాంఫట్
సోమవారం ఒక్కరోజే ప్రపంచంలోని టాప్ 500 కుబేరులు 239 బిలియన్ డాలర్లు కోల్పోయారు. 2016 అక్టోబర్ తర్వాత అతిపెద్ద నష్టం ఇదే కావడం గమనార్హం. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు టాప్ 500 బిలియనీర్ల సంపద దాదాపు హాఫ్ ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది.

అత్యంత నష్టపోయింది అర్నాల్డ్
కరోనా వైరస్ తెరపైకి వచ్చినప్పటి నుండి అందరికంటే ఎక్కువగా నష్టపోయిన కుబేరుల్లో అర్నాల్ట్ ముందున్నారు. కేవలం రెండు నెలల్లోనే ఇతని సంపద ఏకంగా 24 శాతం హరించుకుపోయింది. ఎందుకంటే ఇతని కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడ్డాయి.

ఎలాన్ మస్క్ కోల్పోయింది ఎంత అంటే
కరోనా వైరస్ దెబ్బతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఒక్కరోజే 6.75 బిలియన్ డాలర్లు కోల్పోయారు. మొత్తానికి సోమవారం ఒక్కరోజే బిలియనీర్లు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.

ముఖేష్‌ను దాటేసిన జాక్ మా
మొన్నటి వరకు ఆసియా కుబేరుడిగా నిలిచిన ముఖేష్ సంపద సోమవారం ఒక్కరోజే 5.8 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానం నుండి ఆయన రెండో స్థానానికి పడిపోయారు. ఆ స్థానానికి అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా వచ్చి చేరారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications