For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు నోకియా షాక్, రెండేళ్లలో 10 వేలమందికి బయటకు..

|

వైర్‌లెస్ నెట్ వర్క్ పరికరాల తయారీ సంస్థ నోకియా తమ ఉద్యోగాల్లో వేలాది మందికి షాకిస్తోంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశ్యంలో భాగంగా దాదాపు 10వేల మంది సిబ్బందిని తొలగించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నోకియాకు ఉన్న ఉద్యోగుల్లో ఇది పది శాతం వాటా. కరోనా కారణంగా గత ఏడాది కాలంగా వివిధ రంగాల్లో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత లేదా వేతనాల కోతకు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. ఇప్పుడు నోకియా తమ ఉద్యోగులకు షాకిస్తోంది.

పరిశోధన, డెవలప్‌మెంట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు 5G టెక్నాలజీ రంగానికి అవసరమైన పరికరాలు సరఫరా చేయడానికి భారీ స్థాయిలో పెట్టుబడి పెడుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధపడింది. నోకియా సంస్థలో 90,000 మంది వరకు ఉద్యోగులు ఉండగా వచ్చే రెండేళ్లలో 11 శాతం తగ్గి ఈ సంఖ్య 80వేలకు తగ్గనుంది.

Nokia announces thousands more job cuts but that still may not turn things around

2023 నాటికి 715 మిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. నోకియా ఇటీవల కొద్ది సంవత్సరాల్లో 11,000 ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరో పదివేల మంది ఉద్యోగులను తొలగించింది. 2023 చివరి నాటికి కంపెనీలో ఉద్యోగులు 20 శాతం మేర తగ్గనున్నారు.

English summary

ఉద్యోగులకు నోకియా షాక్, రెండేళ్లలో 10 వేలమందికి బయటకు.. | Nokia announces thousands more job cuts but that still may not turn things around

Finnish kit vendor Nokia is still struggling for cash, so will cut up to 10,000 more jobs over the next couple of years to lower its costs.
Story first published: Wednesday, March 17, 2021, 9:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X