For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలగింత లేదు, కానీ: ఉద్యోగులకు విస్తారా సీఈవో హామీ

|

వచ్చే ఏడాది జనవరిలో వేతనకోతలపై సమీక్షిస్తామని, అయితే ఉద్యోగాల కోత మాత్రం ఉండదని విస్తారా సీఈవో లెస్లీ తంగ్ అన్నారు. విస్తారాలో ఎలాంటి ఉద్యోగ కోతలు లేవని, ఇంతకుముందు ఉన్న దాదాపు నాలుగువేల మంది ఉద్యోగులు కొనసాగుతారని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నేపథయంలో ప్రధానంగా విమాయానరంగంపై భారీగా దెబ్బపడింది. దీంతో కార్యకలాపాలు నిలిచిపోయి దేశీయ విమానయాన పరిశ్రమ కుదేలైంది.

రూ.2,000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత, ప్రభుత్వం క్లారిటీరూ.2,000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత, ప్రభుత్వం క్లారిటీ

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వేతనాల కోత, ఉద్యోగాల తొలగింత వంటి చర్యలు చేపట్టాయి. విస్తారాలో ఉద్యోగాల కోత ఉంటాయని భావించారు. దీనిపై సీఈవో స్పందించారు. విస్తారాలో అన్ని ఉద్యోగాలను రక్షించుకునేందుకు వేతన కోతల ద్వారా వ్యయాలను తగ్గించుకోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని, డిసెంబర్ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని, జనవరిలో దీనిపై పునఃసమీక్షిస్తామని చెప్పారు.

No layoffs, salary cuts to be reviewed in Jan 2021, says Vistara CEO

కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలుపోయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోను ఇదే పరిస్థితి. కరోనా వల్ల ఎక్కువగా విమాయానం, హోటల్స్ అండ్ రెస్టారెంట్ వంటి రంగాలు దెబ్బతిన్నాయి. కేవలం ఈ-కామర్స్ వ్యాపారం మాత్రమే భారీగా పెరిగింది. ఫార్మారంగం పుంజుకుంది. మిగతా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు లేక కొన్ని కంపెనీలు ఉద్యోగాల కోత విధించాయి. మరికొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించాయి.

English summary

తొలగింత లేదు, కానీ: ఉద్యోగులకు విస్తారా సీఈవో హామీ | No layoffs, salary cuts to be reviewed in Jan 2021, says Vistara CEO

Vistara, which has implemented various cost-saving measures amid the coronavirus pandemic, will review salary cuts in January but has not laid off any of its nearly 4,000 employees, according to the airline's chief.
Story first published: Monday, September 21, 2020, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X