For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్: గూగుల్ యాప్స్ లేకుండానే హువావే ఫోన్

|

చైనా మొబైల్ దిగ్గజం హువావేపై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ నేపథ్యంలో గూగుల్ యాప్స్ లేకుండానే హువావే తన కొత్త స్మార్ట్ ఫోన్ మేట్ ఎక్స్‌ను విడుదల చేసింది. హువావే నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.

మేట్ ఎక్స్ ఎనిమిది ఇంచెస్ ఫోల్డబుల్ డిస్ ప్లేతో వస్తోంది. దీని ధర 16,999 యువాన్లు. అమెరికా కరెన్సీ ప్రకారం 2,422 డాలర్లు. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్‌కు పోటీగా దీనిని తెచ్చారు. సెక్యూరిటీ కారణాలతో హువావేపై అమెరికా నిషేధం విధించిన నేపథ్యంలో గూగుల్ యాప్స్ లేకుండా ఈ ఫోన్‌ను తీసుకు వచ్చింది. ఇందులో క్వాల్కమ్‌కు బదులు కిరిన్ 980 ప్రాసెసర్ ఉపయోగించారు.

No Google apps, but Huawei phones still a draw

8GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్‌తో పాటు ఈఎంయూఐ9తో పని చేసే ఈ పోన్లో కేవలం చైనాకు చెందిన యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. గూగుల్ ఏ యాప్స్ కూడా అందుబాటులో ఉండవు. అమెరికాలో హువావే తన ఉత్పత్తులు విక్రయించుకోవచ్చునని తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా అనుమతులు మాత్రం లభించలేదు. ప్రస్తుతం చైనాలో ఈ ఫోన్ వచ్చింది. ఇతర దేశాల్లోను విక్రయించేందుకు ప్లాన్ చేస్తోంది.

English summary

డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్: గూగుల్ యాప్స్ లేకుండానే హువావే ఫోన్ | No Google apps, but Huawei phones still a draw

Huawei's foldable Mate X finally went on sale in China today, nearly nine months after its introduction at the Mobile World Congress in Barcelona.
Story first published: Sunday, November 17, 2019, 14:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X