For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Powerful Women: ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్.. మెుత్తం ఆరుగురు మహిళలు..

|

Forbes Powerful Women: ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈ జాబితాలో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, నైకా వ్యవస్థాపకుడు ఫల్గుణి నాయర్ కూడా చోటు దక్కించుకున్నారు. అయితే ఈ వార్షిక జాబితాలో మొత్తం ఆరుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకోవటం గమనార్హం. నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి జాబితాలో 36వ ర్యాంక్‌తో చోటు దక్కించుకున్నారు.

శక్తివంతమైన మహిళలు..

శక్తివంతమైన మహిళలు..

నిర్మలా సీతారామన్ తర్వాత.. 72వ మజుందార్-షా, ఫాల్గుణీ నాయర్ 89వ స్థానంలో నిలిచారు. జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోష్నీ నాదర్ మల్హోత్రా 53వ స్థానంలో, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ సోమ మండల్ కూడా ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా..

ప్రపంచ వ్యాప్తంగా..

జాబితాలో 39 మంది సీఈవోలు, 10 మంది దేశాధినేతలు, 11 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ దాదాపు 115 బిలియన్ డాలర్లుగా ఉంది. 59 ఏళ్ల వ్యాపారవేత్త ఫాల్గుణీ నాయర్ రెండు దశాబ్దాలుగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారని, అనేక IPOలకు నాయకత్వం వహించి.. అనేక మంది వ్యాపారవేత్తల కలలను సాకారం చేసుకునేందుకు సహకరించారని ఫోర్బ్స్ నాయర్ గురించి తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్ అన్ని వ్యూహాత్మక నిర్ణయాల్లో 41 ఏళ్ల మల్హోత్రా కీలక పాత్ర పోషించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. అదే విధంగా బుచ్ సెబీకి దేశంలోనే తొలి మహిళా ఛైర్మన్ గా నియమితులయ్యారు.

సెయిల్ విజయ ప్రయాణం..

సెయిల్ విజయ ప్రయాణం..

సెయిల్ ఛైర్‌పర్సన్ సోమ మండల్ అరంగేట్రం తర్వాత మూడు రెట్లు వృద్ధి చెంది రూ.120 బిలియన్లకు చేరుకుంది. అదే విధంగా సెయిల్‌కు సారథ్యం వహించిన మొదటి మహిళగా మండల్ బాధ్యతలు చేపట్టి రికార్డు స్థాయిలో ఆర్థిక వృద్ధిని సాధించి చూపారు. పదవీకాలం ప్రారంభమైన మొదటి ఏడాదిలో కంపెనీ లాభం మూడు రెట్లు పెరగటం రికార్డుగా చెప్పుకోవాలి.

టాప్ స్థానాల్లో వీరే..

టాప్ స్థానాల్లో వీరే..

యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నాయకత్వం వహించినందుకు, కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి చేసిన కృషికు ఆమె ఆ స్థానాన్ని అందుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉండగా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు. ఇరాన్‌కు చెందిన జినా మహ్సా అమిని జాబితాలో మరణానంతరం 100వ స్థానంలో నిలిచారు.

English summary

Powerful Women: ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్.. మెుత్తం ఆరుగురు మహిళలు.. | Nirmala Sitharaman stood in Forbes World 100 powerful women latest list

Nirmala Sitharaman stood in Forbes World 100 powerful women latest list
Story first published: Thursday, December 8, 2022, 14:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X