For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nirmala Sitharaman: 1991 సంస్కరణలపై నిర్మలమ్మ కామెంట్స్.. దిమ్మతిరిగే బదులిచ్చిన చిదంబరం..

|

Nirmala Sitharaman: 1991 ఆర్థిక సంస్కరణల కారణంగా భారత అభివృద్ధి వేగం పుంజుకుందన్న విషయం అందరూ ఒప్పుకోక తప్పని విషయం. ఈ విషయం దేశంలోని వ్యాపారవేత్తలకు బాగా తెలిసిందే. అప్పట్లో ఉన్న లైసెన్స్ రాజ్ వ్యవస్థ వల్ల చాలా నెమ్మదిగా దేశం ఎదిగింది. ఒకానొక సమయంలో భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు ఒక్క బిలియన్ డాలర్ల కంటే తక్కువకు చేరుకోవటం నుంచి నేడు భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగింది.

నిర్మలా సీతారామన్ కామంట్స్..

1991 సంస్కరణలు అర్ధాంతరంగా ముగిశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రాథమిక వ్యవస్థాగత మార్పులను ప్రారంభించాల్సి వచ్చిందని ఒక సమావేశంలో అన్నారు. ఇదే క్రమంలో పేదలు, అట్టడుగు వర్గాల అవసరాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తాము చేపట్టిన సంస్కరణల వల్ల భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఇది చాలా సంవత్సరాల క్రితమే సాధించవలసి ఉందని, అయితే ఆర్థిక వ్యవస్థ తప్పుతో కుదేలైందని అన్నారు.

చిదంబరం సీరియస్..

చిదంబరం సీరియస్..

1991 ఆర్థిక సంస్కరణలపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరం ఖండించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంస్కరణలను హాఫ్ బేక్డ్ అనటంపై తనదైన సైలిలో స్పందిస్తూ.. దేవుని దయవల్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ నోట్ల రద్దు, బహుళ GST రేట్లు, పెట్రోల్ & డీజిల్‌పై క్రూరమైన పన్నులు వంటి వాటిని వండి వడ్డించలేదని అన్నారు. ప్రజలపై భారీగా పన్నుల భారాన్ని మోపటం బీజేపీకే చెల్లిందని అన్నారు.

 వాజ్‌పేయి హయాంలో..

వాజ్‌పేయి హయాంలో..

వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పెద్దగా అభివృద్ధి ఏమీ జరగలేదని నిర్మల అన్నారు. ఆ తర్వాత మౌలిక సదుపాయాలు, రోడ్లు, టెలికాం రంగం, మొబైల్ సేవలు మొదలైన వాటిపై ఆయన దృష్టి దేశానికి పెద్ద ఎత్తున సహాయపడిందన్నారు. అయితే గత పాలన స్వలాభాలపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. మోదీ నేతృత్వంలో బీజేపీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ద్వారా ప్రజలకు పథకాలను చేరువచేశామన్నారు. ఇది టెక్నాలజీ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పని.. దీని ద్వారా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా రూ.2,000 కోట్లు ఆదా అయ్యాయన్నారు.

English summary

Nirmala Sitharaman: 1991 సంస్కరణలపై నిర్మలమ్మ కామెంట్స్.. దిమ్మతిరిగే బదులిచ్చిన చిదంబరం.. | nirmala sitharaman called 1991 economic reforms as half cooked p Chidambaram fired on comments

nirmala sitharaman called 1991 economic reforms as half cooked PChidambaram fired on comments
Story first published: Friday, September 16, 2022, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X