For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI హృదయంలేని బ్యాంకు: రజనీష్‌పై సీతారామన్ తీవ్రఆగ్రహం, ఆడియో లీక్.. అందులో ఏముందంటే?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఆ బ్యాంకు చైర్మన్ రజనీష్ కుమార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. మీడియాలో వస్తున్న వార్తల మేరకు... SBI ఓ హృదయం లేని బ్యాంకు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ అసమర్థతే బ్యాంకును ఇలా తయారు చేసిందని రజనీష్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనాతో ఫుడ్ ఆర్డర్ చేయలేకపోతున్నారా: మీ కోసమే 'కాంటాక్ట్‌

ఆమె ఆగ్రహానికి కారణమిదే..

ఆమె ఆగ్రహానికి కారణమిదే..

అసోంలోని తేయాకు తోటల కార్మికుల బ్యాంకు ఖాతాల్ని వాడుకలోకి తీసుకు రాలేకపోయారని నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. ఇందుకు సంబంధించి లీకైన ఒక ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. రుణ వితరణ పెరగకపోవడానికి, ముఖ్యంగా అసోం తేయాకు తోటల్లో పని చేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆయనేనని తప్పుబట్టారు.

ఇది ఎప్పుడు జరిగిందంటే?

ఇది ఎప్పుడు జరిగిందంటే?

ఎస్బీఐ జాలిలేని బ్యాంకు అని వ్యాఖ్యానించడం ద్వారా ఆమె తీవ్రంగానే మండిపడినట్లుగా అర్థమవుతోంది. ఈ సంఘటన ఫిబ్రవరిలో గౌహతిలో ఎస్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

AIBOC ఖండన

AIBOC ఖండన

రజనీష్ కుమార్ పైన ఆర్థికమంత్రి సీతారామన్ వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (AIBOC) ఖండించింది. ఎస్బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్‌ చేశారని, దీనిపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

ఆడియో క్లిప్‌లో ఏముందంటే?

ఆడియో క్లిప్‌లో ఏముందంటే?

ఎస్బీఐ అకౌంట్స్, లోన్ల అంశంపై టీ గార్డెన్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్మలా సీతారామన్‌కు తెలిసింది. దీంతో ఆమె ఘాటుగా మాట్లాడారు.

- ఎస్బీఐ పెద్ద బ్యాంకుగా చెప్పడం మాత్రమే కాదు. అసలు హృదయం లేని బ్యాంకు. ఎస్ఎల్‌బీసీలు ఇలా ఉండవని నిర్మలా సీతారామన్ అన్నారు.

- ఎస్బీఐ చైర్మన్‌ను ఉద్దేశించి ఆమె మరోసారి.. ఇలాంటివి నడవవు అన్నారు.

- ప్రభుత్వం చేస్తోంది, ప్రధానమంత్రి పదేపదే చెబుతున్నారు.. మీరు డిపార్టుమెంట్‌ను అప్రోచ్ కావాలని, ఆర్బీఐతో మాట్లాడాల్సిందన్నారు.

- మీ పట్ల ఆగ్రహిస్తున్నందుకు సారీ అని, కానీ కార్మికుల ఖాతాలను వాడుకలోకి తీసుకు రాకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

- అసోం తేయాకు తోటల్లో పని చేసే వారికి రుణాలు లభించకపోవడానికి మీరే కారణమని అభిప్రాయపడ్డారు.

ప్లాన్ చెప్పాలని..

ప్లాన్ చెప్పాలని..

- అంతేకాదు, అసలు ఇప్పుడైనా ఏం చేస్తారో చెప్పాలని, ఎలాంటి ప్లాన్‌తో ముందుకు సాగుతారని, టైమ్ లైన్ ఏమిటో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

- సాధ్యమైనంత త్వరలో దీనిని పూర్తి చేస్తామని రజనీష్ కుమార్ చెప్పారు.

- దానికి సీతారామన్ స్పందిస్తూ.. షార్ట్ టైమ్ అంటే ఎంతకాలమని తిరిగి ప్రశ్నించారు.

- వారంలో పూర్తి చేస్తామని రజనీష్ కుమార్ చెప్పారు.

- సమయం ఇవ్వడం కాదని, ఢిల్లీలో కలవాలని, ఇది ఉద్యోగ బాధ్యతను విస్మరించడమేనని, వైఫల్యం ఉంటే నేనూ బాధ్యత వహిస్తానని, మీతో నేను పూర్తి వివరాలు మాట్లాడుతానని నిర్మల అన్నారు.

సారీ సర్.. కానీ ఒక్క టీ గార్డెన్ కార్మికుడు కూడా బాధపడొద్దు

సారీ సర్.. కానీ ఒక్క టీ గార్డెన్ కార్మికుడు కూడా బాధపడొద్దు

- రజనీష్ కుమార్‌ను ఉద్దేశించి.. సర్ మీరు చాలా సీనియర్ ఆఫీసర్ కావొచ్చు, నన్ను క్షమించండి, మీరు (బ్యాంకు) కేంద్ర, అసోం రాష్ట్ర ప్రభుత్వాలను నిరాశపరిచారన్నారు.

- అకౌంట్స్ అన్నీ కొనసాగించాలని, ఒక్క టీ గార్డెన్ కార్మికుడు కూడా బాధపడవద్దని నిర్మల సూచించారు.

English summary

Nirmala flays Heartless SBI, Inefficient Chief in leaked audio, AIBOC slams

An audio clip of Finance Minister Nirmala Sitharaman referring to the State Bank of India (SBI) as a “heartless bank” has gone viral.
Story first published: Monday, March 16, 2020, 9:12 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more