For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీరవ్ మోడీకి భారీ షాక్, భారత్ రప్పించేందుకు లండన్ కోర్టు ఓకే

|

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు టోపీ పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో బ్రిటన్ కోర్టు కీలక తీర్పు చెప్పింది. భారత్‌కు అప్పగించే అంశానికి సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని, అతనిని భారత్ తీసుకు వచ్చేందుకు కోర్టు అంగీకారం తెలిపింది.

తనను రప్పించినట్లయితే తప్ప న్యాయం జరగదని చెప్పడానికి ఆధారాలు లేవని, తనకు న్యాయం జరగదన్న నీరవ్ వాదనను కోర్టు తోసిపుచ్చింది . PNB మోసం, మనీలాండరింగ్ కేసులో నీరవ్‌ని భారత్ రప్పించేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి నీరవ్ మోడీ భారత్‌లో సమాధానం చెప్పాలని జడ్జి పేర్కొన్నారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి, సాక్షులను బెదిరించడానికి నీరవ్ కుట్ర పన్నినట్లు అర్థమవుతోందని జడ్జి తెలిపారు.

Nirav Modi can be extradited to India, says UK Court

నీరవ్ మోడీని భారత్‌కు పంపిస్తే అతనికి న్యాయం జరగదన్న అనుమానం లేదని, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో బ్యారక్ 12 నీరవ్‌తు సరిపోతుందని యుకె కోర్టు జడ్జి పేర్కొన్నారు. నీరవ్ కేసును ప్రభావితం చేయడానికి భారత కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రయత్నించారన్న నీరవ్ డిఫెన్స్ వాదనలను యుకె న్యాయమూర్తి తోసిపుచ్చారు.

English summary

నీరవ్ మోడీకి భారీ షాక్, భారత్ రప్పించేందుకు లండన్ కోర్టు ఓకే | Nirav Modi can be extradited to India, says UK Court

Jeweller Nirav Modi, wanted for fraud and money laundering in the ₹ 14,000-crore Punjab National Bank (PNB) loan scam, can be extradited to India, a UK judge ruled today, dismissing arguments like his mental health worsening during the pandemic and poor Indian prison conditions.
Story first published: Thursday, February 25, 2021, 21:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X