For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక, ఐటీ రిటర్న్స్‌లో క్రిప్టో ఆదాయానికి ప్రత్యేక కాలమ్, పన్ను భారం

|

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. వచ్చే ఏడాది నుండి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులకు సంబంధించి ఓ కాలమ్ ఉండనుంది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. తదుపరి ఆర్థిక సంవత్సరం నుండి ఐటీఆర్‌లో క్రిప్టో కరెన్సీ నుండి పొందే ఆదాయం కోసం ప్రత్యేక కాలం ఉంటుందని బుధవారం నాడు తరుణ్ బజాజ్ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

క్రిప్టోకు కాలం

క్రిప్టోకు కాలం

'వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫామ్‌లో క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చిన లాభాలు వెల్లడించేందుకు, తద్వారా పన్నులు చెల్లించడానికి ఓ కాలమ్ ఉంటుంది' అని తరుణ్ బజాజ్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి క్రిప్టో వచ్చే ఆదాయంపై, ట్రాన్సాక్షన్స్ పైన 30 శాతం పన్ను, సర్‌ఛార్జ్ ఉంటుంది. క్రయవిక్రయాలపై 1 శాతం టీడీఎస్ కూడా ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. ఈ తరహా బహుమతులకు కూడా వర్తిస్తుంది. క్రిప్టో నుండి వచ్చే లాభాలు ఎప్పుడు కూడా పన్ను పరిధిలోకి వస్తాయని, బడ్జెట్ ప్రతిపాదన కొత్త ఏమీ కాదని, అయితే ఇందుకు సంబంధించి జరిగిన చర్చకు పుల్‌స్టాప్ పడిందని బజాజ్ అభిప్రాయపడ్డారు.

వ్యాపార ఆదాయం

వ్యాపార ఆదాయం

ఫైనాన్స్ బిల్లులోని నిబంధన వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధించడానికి సంబంధించినదన్నారు. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కాకపోవచ్చునని చెప్పారు బజాజ్. ఇదో వ్యాపార ఆదాయమని, అందుకే 30 శాతం పన్ను అన్నారు. ఇక టీడీఎస్‌తో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ సమాచారం ఆటోమేటిక్‌గా ఐటీ శాఖకు చేరుతుందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు పొందిన క్రిప్టో ఆదాయాన్ని ఐటీఆర్‌లో ఎక్కడైనా చూపవచ్చునని, కానీ దీనిపై ఐటీ అధికారులదే నిర్ణయం అన్నారు.

ఎంత మొత్తంపై ఎంత పన్ను

ఎంత మొత్తంపై ఎంత పన్ను

ఆదాయపు పన్ను చెల్లింపుల ద్వారా ఐటీఆర్ అప్‌డేషన్ కోసం ట్యాక్స్ పేయర్లను రెండేళ్లు అనుమతించింది ఆమ్నెస్టీ పథకంలో భాగం కాదని, కేవలం విస్మరించిన ఆదాయ ప్రకటన, తప్పులను సరిదిద్దడానికి అన్నారు. క్రిప్టో మార్కెట్ పైన ఓ అంచనాకు రావడానికి క్రిప్టో పన్ను దోహదం చేస్తుందని తెలిపారు.

క్రిప్టో ఆస్తులకు సంబంధించి చెల్లింపులు ఏడాదికి రూ.10వేలు దాటితే 1 శాతం టీడీఎస్. ఆదాయం రూ.50 లక్షలు దాటితే 30 శాతం పన్ను, 15 శాతం సెస్, సర్‌ఛార్జ్. ఏప్రిల్ 1 నుండి 30 శాతం పన్ను, జూలై 1 నుండి 1 శాతం టీడీఎస్.

English summary

ఇక, ఐటీ రిటర్న్స్‌లో క్రిప్టో ఆదాయానికి ప్రత్యేక కాలమ్, పన్ను భారం | Next year's IT return to have separate column for crypto income

Income tax return forms from next year will have a separate column for making disclosures on gains made from cryptocurrencies and paying taxes, Revenue Secretary Tarun Bajaj said on Wednesday.
Story first published: Thursday, February 3, 2022, 9:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X