For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలో MDM స్కీం కోసం అదనంగా రూ.200 కోట్లు, ప్రతిరోజూ గుడ్డు, మెనూ ఇదే

|

పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండురోజుల క్రితం జగన్ మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మెనూలో తీసుకు వస్తున్న మార్పుల గురించి చర్చించారు.

ఈ ఒక్కసారికి అమ్మఒడిపై జగన్ ప్రభుత్వం శుభవార్త! వారికి రీవెరిఫికేషన్ఈ ఒక్కసారికి అమ్మఒడిపై జగన్ ప్రభుత్వం శుభవార్త! వారికి రీవెరిఫికేషన్

సంక్రాంతి తర్వాత మెనూలో నాణ్యత పెంపు

సంక్రాంతి తర్వాత మెనూలో నాణ్యత పెంపు

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచడం కోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో వండే ఆయాలకు రూ.3,000 ఇస్తున్నారు. అంటే నాణ్యత పెంచేందుకు రూ.350 కోట్లకు పైగా అవుతోంది. మధ్యాహ్న భోజన పథకం కోసం రూ.1,294 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సంక్రాంతి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు నుంచి నాణ్యమైన మెనూ అమలులోకి వస్తుంది.

సంక్రాంతి తర్వాత మెనూలో మార్పులు

సంక్రాంతి తర్వాత మెనూలో మార్పులు

- సోమవారం అన్నం, పప్పుచారు, గుడ్డు కూర, చిక్కి

- మంగళవారం పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు

- బుధవారం కూరగాయల అన్నం, ఆలూ కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

- గురువారం పెసరపప్పు అన్నం (కిచిడీ), టమోటా చట్నీ, ఉడికించిన గుడ్డు

- శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

- శనివారం అన్నం, సాంబార్, తీపి పొంగలి.

విద్యార్థులకు కిట్

విద్యార్థులకు కిట్

వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు, ఒకేరకమైన డ్రెస్ అందించనున్నారు. విద్యార్థులకు అందించే కిట్‌లో మూడు రకాల దుస్తులు ఉంటాయి. పుస్తకాలు, నోటు పుస్తకాలు, జత బూట్లు, సాక్స్, బెల్ట్, బ్యాగ్ ఉంటాయి.

ఇంగ్లీష్ మీడియం కోసం ఉపాధ్యాయులకు యాప్

ఇంగ్లీష్ మీడియం కోసం ఉపాధ్యాయులకు యాప్

ఏపీలో అన్ని స్కూల్స్‌లలోను ఇంగ్లీష్ మీడియంపై ప్రవేశ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులకు స్వయం శిక్షణ కోసం ఓ యాప్ సిద్ధం చేస్తున్నారు.

English summary

ఏపీలో MDM స్కీం కోసం అదనంగా రూ.200 కోట్లు, ప్రతిరోజూ గుడ్డు, మెనూ ఇదే | New MDM scheme menu for All Schools in Andhra Pradesh

New Mid Day Meal (MDM) scheme menu for All Schools in Andhra Pradesh. chief minister YS Jagan Mohan Reddy ordered to implement new menu after sankranti festival.
Story first published: Wednesday, January 8, 2020, 8:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X