For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ బ్రాండ్స్‌పై కరోనా దెబ్బ, హెచ్‌డీఎఫ్‌సీ మోస్ట్ బ్రాండ్

|

కరోనా మహమ్మారి అన్నిరంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ బాండ్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఏడాది టాప్ 75 సంస్థల బ్రాండ్ వ్యాల్యూ గత ఏడాది పోలిస్తే 6 శాతం క్షీణించి 216 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటనల సంస్థ డబ్ల్యుపీపీ తెలిపింది. కరోనాతో మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తోంది. డబ్ల్యుపీపీ, దాని అనుబంధ సంస్థ కంతర్ ఈ ఏడాదికి గాను భారతీయ బ్రాండ్స్ వ్యాల్యూను తాజాగా విడుదల చేశాయి.

బ్రాండ్స్ టాప్ 75 మోస్ట్ వ్యాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2020 పేరుతో వచ్చిన ఈ జాబితాలో ప్రయివేటు రంగ బ్యాంకింగ్ HDFC మోస్ట్ వ్యాల్యుబుల్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ వ్యాల్యూ క్షీణించినా అగ్రస్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్ వ్యాల్యూ దాదాపు రూ.16,600 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం సంస్థల బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

New brands reports reflects economic impact of Coronavirus

రిలయన్స్ రిటైల్ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 102 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జాబితాలో ఇది 25వ స్థానంలో ఉంది. టెలికం, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని సంస్తల బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగినట్లు తెలిపింది. కరోనా ప్రభావంతో సంబంధం లేకుండా వృద్ధి కనిపించినట్లు తెలిపింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ సంస్థల బ్రాండ్ వ్యాల్యూ బాగా తగ్గినట్లు వెల్లడించింది.

English summary

దేశీయ బ్రాండ్స్‌పై కరోనా దెబ్బ, హెచ్‌డీఎఫ్‌సీ మోస్ట్ బ్రాండ్ | New brands reports reflects economic impact of Coronavirus

The 2020 BrandZ Top 75 Most Valuable Indian Brands report released by WPP and Kantar reflects the impact of the economic slowdown caused by the COVID-19 pandemic. The top 75 brands together were valued at $216 billion, a decline of 6 per cent over the 2019 ranking value.
Story first published: Sunday, September 20, 2020, 18:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X