For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడిపోనున్న జాన్సన్ అండ్ జాన్సన్: రమేష్ అండ్ సురేష్ టైప్‌లో క్రేజీ టైటిల్స్

|

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్..సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వంద సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఈ కంపెనీ ఇక రెండుగా విడిపోనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది. మరో సంవత్సర కాలంలో జాన్సన్ అండ్ జాన్సన్.. రెండుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు హీరో హోండా ఏ రకంగానైతే హీరోగా.. హోండాగా విడిపోయిందో.. అదే తరహాలో ఈ ఫార్మా సంస్థ కూడా డివైడ్ కానుంది.

శ్రీలంక కంపెనీని టేకోవర్ చేసిన ముఖేష్ అంబానీ: కూతురి కోసం దేన్నీ వదలట్లేదుగాశ్రీలంక కంపెనీని టేకోవర్ చేసిన ముఖేష్ అంబానీ: కూతురి కోసం దేన్నీ వదలట్లేదుగా

ఫార్మా, మెడికల్ ప్రొడక్ట్స్ కోసం..

మెడిసిన్స్, ఫార్మా.. ఇలా ఏ సెగ్మెంట్‌కు ఆ సెగ్మెంట్ ప్రత్యేకంగా కార్యకలాపాలను ప్రారంభించాలనే ఉద్దేశంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఫార్మాసూటికల్స్, మెడిసిన్ సెగ్మెంట్ల కోసం ప్రత్యేకంగా కంపెనీల పేర్లను రిజిస్టర్ చేయించే అవకాశాలు ఉన్నట్లు విదేశీ మీడియా స్పష్టం చేస్తోంది. ఫార్మాసూటికల్స్ సెగ్మెంట్‌లో మందుల తయారీ, కరోనా వైరస్ వ్యాక్సిన్.. వాటి పంపిణీ కార్యక్రమాలను చేర్చనుంది.

1886లో ఏర్పాటు

మెడికల్ సెగ్మెంట్‌లో వైద్య పరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్టులను తీసుకుని రావాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా కంపెనీ సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1886 ఈ కంపెనీ ఆవిర్భవించింది. రాబర్ట్ వుడ్ జాన్సన్, జేమ్స్ వుడ్ జాన్సన్, ఎడ్వర్డ్ మీడ్ జాన్సన్ అనే ముగ్గురు అన్నదమ్ములు దీన్ని స్థాపించారు. వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ పేరు వారి మీదే తయారైన విషయం తెలిసిందే. న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్‌విక్ ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం.

125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర..

125 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫార్మాసూటికల్స్ కంపెనీ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ జెన్‌సెన్‌ను అభివృద్ధి చేసింది. అమెరికాలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీన్ని వినియోగిస్తోన్నారు. దేశీయ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీన్ని చేర్చడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను జాన్సన్ అండ్ జాన్సన్.. డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు దాఖలు చేసింది.

లక్షా 36 మంది ఉద్యోగులు..

ప్రపంచవ్యాప్తంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థకు సంబంధించిన యూనిట్లు కొనసాగుతున్నాయి. 1.36 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తోన్నారు. రెండుగా విడిపోవడం ద్వారా మరింత నాణ్యమైన సేవలను, శరవేగంగా అందించడానికి వెసలుబాటు కలుగుతుందనేది కంపెనీ యాజమాన్యం అభిప్రాయం. సంవత్సరం లేదా 18 నెలల కాలంలో ఈ డివిజన్ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

క్రేజీ టైటిల్స్..

కాగా- జాన్సన్ అండ్ జాన్సన్ ఇక రెండుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిన వెంటనే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై మెమెస్ పోటెత్తుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్‌కు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు నెటిజన్లు, ట్విట్టరెటీలు. జాన్ సన్ అండ్ జాన్ డాటర్.. అనే పేర్లను పెట్టాలంటూ నెటిజన్లు సూచిస్తోన్నారు. క్రేజీ టైటిల్స్ పెడుతున్నారు. రమేష్ అండ్ సురేష్ టైప్‌లో పేర్లను సూచిస్తో్నారు ట్విట్టరెటీలు.

దేశీయ మార్కెట్‌పై బలమైన ముద్ర..

దేశీయ మార్కెట్‌పై జాన్సన్ అండ్ జాన్సన్ బలమైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచీ దీని పేరు వినిపిస్తూనే వస్తోంది. చిన్న పిల్లల కోసం గ్రైప్ వాటర్‌ మొదలుకుని.. సబ్బులు, పౌడర్, ఇతర ఫార్మా అండ్ మెడిసిన్ సెగ్మెంట్స్‌కు సంబంధించిన అనేక ప్రొడక్ట్స్‌ను ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక దశలో వినియోగించుకుని ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇక రెండుగా విడిపోవడం వల్ల తమ సేవలను మరింత విస్తృతం, వేగవంతం చేయడానికి దోహదపడుతుందని యాజమాన్యం చెబుతోంది.

English summary

విడిపోనున్న జాన్సన్ అండ్ జాన్సన్: రమేష్ అండ్ సురేష్ టైప్‌లో క్రేజీ టైటిల్స్ | Netizens suggest crazy names for Johnson and Johnson, after the company plans to split

Johnson & Johnson is splitting into two companies, separating the division that sells Band-Aids and Listerine, from its medical device and prescription drug business.
Story first published: Saturday, November 13, 2021, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X