For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో ఎక్కడి నుండైనా వర్క్ ఫ్రమ్ హోమ్, 40,000 మందికి ఊరట

|

అమెరికాలోని తమ నలభై వేలమంది క్లయింట్ సర్వీస్ ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుండి పని చేసేందుకు అనుమతించినట్లు అకౌంటింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ PwC తెలిపింది. డెలాయిట్, కేపీఎంజీ వంటి ప్ర‌ధాన అకౌంటింగ్ సంస్థ‌లు క‌రోనా సమయంలో ఇంటి నుండి ప‌ని చేసే అవకాశాన్ని ఉద్యోగులకు ఇచ్చాయి. అకౌంటింగ్ ఇండస్ట్రీలో క్లయింట్ సర్వీస్ ఉద్యోగులు పూర్తిగా ఇంటి వద్ద నుండి పని చేసేందుకు అవకాశం కల్పించిన తొలి సంస్థ PwC. ఈ మేరకు PwC డిప్యూటీ పీపుల్ లీడర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ష‌న్ ఎంచుకున్న ఉద్యోగులు వారంలో గ‌రిష్ఠంగా మూడు రోజులు కార్యాలయానికి రావలసి ఉంటుంది. క్ల‌యింట్స్‌తో ఇన్-ప‌ర్స‌న్ ఇంట‌ర్వ్యూ, కీల‌క టీమ్ మీటింగ్స్, క్ల‌యింట్ విజిట్స్, లర్నింగ్ సెష‌న్స్‌కు హాజ‌రు కావాల‌ని చెబుతున్నారు. అయితే, వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ష‌న్ ఎంచుకున్న ఉద్యోగుల వేతనాల్లో కోత ఉంటుంద‌ని, వారి నివాస ప్రాంతాన్ని బ‌ట్టి ఈ వేతన కోత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

Nearly 40,000 PwCs US employees can work remote from anywhere in the country

అయితే కరోనా మహమ్మారికి ముందు కంపెనీకి చెందిన ఏడువేల మంది ఉద్యోగులు వర్చువల్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో చేసిన PwC సర్వేలో ఆసక్తికర అంశం వెల్లడైంది. 65 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారు. అందులో 88 శాతం మంది హయ్యర్ పదోన్నతి కోసం చూస్తున్నారు. రానున్న అయిదేళ్ల కాలంలో లక్షమంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు PwC ఇటీవల తెలిపింది.

ఇదిలా ఉండగా, అల్ఫాబెట్ ఇంక్ గూగుల్ కూడా శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ష‌న్ ఎంచుకున్న ఉద్యోగుల నివాస ప్రాంతాన్ని బ‌ట్టి వేత‌నాలు తగ్గిస్తోంది. గత ఏడాది మార్చి నుండి క‌రోనా నుండి బ‌య‌ట‌ప‌డేందుకు అమెరికాలోని కంపెనీల్లోని ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ సేవలు అందిస్తున్నారు.

English summary

దేశంలో ఎక్కడి నుండైనా వర్క్ ఫ్రమ్ హోమ్, 40,000 మందికి ఊరట | Nearly 40,000 PwCs US employees can work remote from anywhere in the country

PwC announced today it will allow all U.S. employees who can telework the ability to work virtually from anywhere in the continental U.S. moving forward.
Story first published: Sunday, October 3, 2021, 19:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X