కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో భాగంగా కేంద్రం నేషనల్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో ఈ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ధృవీకరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇందుకు తొలుత రూ.20వేల కోట్ల పెయిడప్ క్యాపిటల్‌ను సమకూర్చవచ్చునని చెబుతున్నారు. ప్రావిడెంట్, పెన్షన్, ఇన్సురెన్స్ ఫండ్ సంస్థలు తమ నిధుల్లో కొన్నింటిని తప్పనిసరిగా నేషనల్ బ్యాంకులో ఉంచేలా కేంద్రం నిర్ధేశించవచ్చునని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో అన్ని రంగాలు, వర్గాలకు అనుకూల ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. రియాల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో, హాస్పిటాలిటీ తదితర రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. రియాల్టీ రంగం ఉపాధి పరంగా రెండో అతిపెద్ద రంగంగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు, రియాల్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రియాల్టీ రంగానికి ఉతమిచ్చేందుకు, వినియోగదారుల డిమాండ్ పెంచడానికి చర్యలు చేపట్టవలసి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications