For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రంగంలో నిరుద్యోగం తగ్గినా.. H1Bపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం, అమెరికాకు నష్టం

|

అమెరికాలో ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న భారతీయులు సహా వివిధ దేశాల వారికి ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వు ద్వారా విదేశీయులు, హెచ్1బీ వీసాదారులకు ఫెడరల్ ఏజెన్సీలో ఉద్యోగ అవకాశాలు ఉండవు. హైర్ అమెరికన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ మొదటి నుండి ఆ దిశగానే వెళ్తున్నారు. కరోనా కారణంగా కోట్లాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్‌కాం, హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (HYSEA) స్పందించింది.

సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!

తప్పుడు సమాచారం... అపోహలు

తప్పుడు సమాచారం... అపోహలు

తప్పుడు సమాచారం, అపోహల ఆధారంగా ఫెడరల్ ఏజెన్సీల ఉద్యోగాల నుండి H1B వీసాదారులను నిరోధించాలన్న ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయని నాస్‌కాం అభిప్రాయపడింది. అన్ని ప్రభుత్వ సంస్థలు 120 రోజుల్లో అంతర్గత ఆడిటింగ్ పూర్తి చేసుకొని, ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల మేరకు మానవ వనరులు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. హెచ్1బీ, ఎల్1 వంటి తాత్కాలిక విదేశీ కార్మికులకు సంబంధించిన జాబితాను తయారు చేయాలని ప్రతి ఫెడరల్ డిపార్టుమెంట్, ఏజెన్సీలను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తారు. అంతేకాదు, ఉద్యోగ సైట్లలో హెచ్1బీ వీసా హోల్డర్ల ఉద్యోగాల వల్ల అమెరికా వర్కర్స్‌ను రక్షించే విధంగా 45 రోజుల్లో చర్యలు తీసుకోవాలని లేబర్ అండ్ హోమ్ సెక్యూరిటీ సెక్రటరీలను ఆదేశించింది.

ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిస్తుంది

ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిస్తుంది

కరోనా మహమ్మారి అనంతరం క్రమంగా ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయని, ఇలాంటి రికవరీ పరిస్థితుల్లో అమెరికాకు ప్రతిభావంత ఉద్యోగులు అవశ్యమని, నిపుణుల విషయంలో పరిమితం చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ వంటివి నెమ్మదిస్తాయని నాస్‌కాం తెలిపింది. అమెరికాలో స్టెమ్ స్కిల్ షార్టేజ్ సమయంలో ఈ ఉత్తర్వులు వచ్చాయని పేర్కొంది.

సాఫ్టువేర్ రంగంలో తగ్గిన నిరుద్యోగం.. అయినా..

సాఫ్టువేర్ రంగంలో తగ్గిన నిరుద్యోగం.. అయినా..

అయినప్పటికీ కంప్యూటర్ ఆక్యుపేషన్స్‌లో నిరుద్యోగిత రేటు 2020 జనవరిలో 3 శాతంగా కాగా, మేలో 2.5 శాతానికి తగ్గిందని, ఇతర అన్ని రంగాల్లో నిరుద్యోగిత రేటు మాత్రం 4.1 శాతం నుండి 13.5 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత 6,25,000 యాక్టివ్ జాబ్ వెకెన్సీస్ ఉన్నట్లు తెలిపారు. ఇందులో హెచ్1బీ వీసాదారులకు కూడా ఉద్యోగాలు సాధారణమే అన్నారు.

English summary

ఐటీ రంగంలో నిరుద్యోగం తగ్గినా.. H1Bపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం, అమెరికాకు నష్టం | Nasscom says Trump's order on H1B visa based on misinformation

IT industry body Nasscom said that US President Donald Trump’s executive order on preventing federal agencies from using H-1B visa holders appeared to be based on misinformation and misperceptions.
Story first published: Wednesday, August 5, 2020, 7:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X