For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు అనుకూలం కాదు: నారాయణమూర్తి

|

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో, దాదాపు అన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరలారు. చాలా కంపెనీలు ఇప్పటికీ దీనిని కొనసాగిస్తున్నాయి. మన దేశంలో ఐటీ రంగం నుండి అన్ని రంగాల్లోని ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ఆ తర్వాత హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు కూడా మొగ్గు చూపారు. పలు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొంతమందిని పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు కేటాయిస్తామని, ఇది రొటేషన్ పద్ధతి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోం పైన నారాయణమూర్తి తాజాగా స్పందించారు.

భారత్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ సరిపడదన్నారు. క‌రోనా త‌గ్గుద‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధార‌ణ ప‌రిస్ధితులు నెలకొంటున్నాయి. దీంతో కంపెనీలు తిరిగి త‌మ ఉద్యోగులను కార్యాల‌యాల‌కు ర‌ప్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. వ‌ర్క్ ఫ్రం హోంకు అల‌వాటు ప‌డిన ఉద్యోగులు కార్యాల‌యాల‌కు క‌దులుతున్నారు. దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్స్ వరకు వర్క్ ఫ్రమ్ హోంకు ముగింపు పలుకుతున్నారు.

 Narayana Murthy says WFH not suitable for India, wants IT employees back in office

ఇన్ఫోసిస్ ఫౌండ‌ర్ నారాయ‌ణమూర్తి ఇంటి నుండి ప‌నిచేసే ప‌ద్ధ‌తి భార‌త్‌కు స‌రిప‌డ‌ద‌న్నారు. తాను వర్క్ ఫ్రమ్ హోంకు అనుకూలం కాద‌ని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తుంటే సంస్ధాగ‌త సంస్కృతి క్రమంగా బలహీనపడుతుందన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌నిచేసే సంస్కృతి ద్వారా కష్టపడి ప‌నిచేయ‌డం, సృజ‌నాత్మ‌క‌త‌, నైపుణ్యం, ప్ర‌తిభను వెలికితీయ‌డం, సంప్ర‌దింపులు వంటి అంశాల్లో మెరుగుద‌ల సాధించ‌డం క‌ష్ట‌మ‌న్నారు.

English summary

వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు అనుకూలం కాదు: నారాయణమూర్తి | Narayana Murthy says WFH not suitable for India, wants IT employees back in office

With a slump in covid cases across the globe, the world is limping back to normalcy. Fewer cured cases also mean that the restrictions around the virus have also started to ease a bit.
Story first published: Sunday, March 20, 2022, 9:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X