For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Myntra: 27,500 మందికి ఉద్యోగాలు: ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ సంచలనం

|

బెంగళూరు: బెంగళూరును ప్రధాన కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా. ఫ్లిప్‌కార్ట్‌కు అనుబంధంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ రిటైల్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఇది. సోమవారం నుంచి స్పెషల్ సేల్స్ బొనాంజాను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. సీజనల్ సేల్స్‌ను సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టింది. సీజనల్ సేల్స్‌ సందర్భంగా అందే ఆన్‌లైన్ ఆర్డర్లను సకాలంలో క్లియర్ చేయడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది.. అవన్నీ తాత్కాలికమే.

LIC: ఇన్వెస్టర్ల డబ్బును ఆవిరి చేసిన షేర్లు ఇవే: లక్షల్లో బాధితులుLIC: ఇన్వెస్టర్ల డబ్బును ఆవిరి చేసిన షేర్లు ఇవే: లక్షల్లో బాధితులు

 తాత్కాలికంగా

తాత్కాలికంగా

తాత్కాలిక ప్రాతిపదిక.. సీజనల్ సేల్స్ ముగిసేంత వరకు మాత్రమే ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఈ సీజన్‌లో 27,500 మంది ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకుంటోంది మింత్రా యాజమాన్యం. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నందిత సిన్హా తెలిపారు. ఎండ్ ఆఫ్ రీజన్ సేల్స్ (ఈఓఆర్ఎస్) పేరుతో స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టినట్లు వివరించారు.

11 నుంచి

11 నుంచి

ఈ నెల 11వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు స్పెషల్ సీజనల్ సేల్స్‌ బొనాంజాను చేపట్టనుంది మింత్రా. ఈ ఆరు రోజుల కాలంలో లక్షల సంఖ్యలో ఆన్‌లైన్ ఆర్డర్స్ అందుతాయని అంచనా వేస్తోంది. వాటన్నింటినీ సకాలంలో క్లియర్ చేయడానికి ఇప్పుడున్న సిబ్బంది సంఖ్య ఏ మాత్రం సరిపోదనే నిర్ణయానికి వచ్చింది. 27,500 మందిని తాత్కాలిక ప్రాతిపదికన అపాయింట్ చేసుకోనుంది. ఈ ఆరు రోజుల సీజన్ ముగిసేంత వరకు మాత్రమే వారు ఉద్యోగాల్లో కొనసాగుతారు.

మహిళలు, దివ్యాంగులకూ..

మహిళలు, దివ్యాంగులకూ..

ఇందులో 2,000 తాత్కాలిక ఉద్యోగాలను మహిళల కోసం రిజర్వ్ చేసింది. అలాగే- మరో 300 మంది దివ్యాంగులను ఉద్యోగంలోకి తీసుకోనుంది. దివ్యాంగులకు గోడౌన్స్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని నందిత సిన్హా చెప్పారు. ఎండ్ ఆఫ్ రీజన్ సేల్స్‌లో ఇప్పటివరకు 27,500 మందికి ఉద్యోగాలను కల్పించేలా చర్యలు తీసుకున్న మొట్టమొదటి కంపెనీ తమదేనని వ్యాఖ్యానించారు. వీరిలో 85 శాతం మందిని డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా నియమిస్తామని అ

గత సీజన్ కంటే రెట్టింపు..

గత సీజన్ కంటే రెట్టింపు..

గత సంవత్సరం సీజనల్ సేల్స్ సమయంలో 11,000 మందిని తీసుకున్నామని గుర్తు చేశారు. డెలివరీ, గోడౌన్స్ మేనేజ్‌మెంట్, గ్రేడింగ్ అండ్ ప్యాకేజింగ్, కాల్ ఆపరేటింగ్.. వంటి కీలక విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమించనున్నట్లు నందిత సిన్హా చెప్పారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కత వంటి ప్రధాన సేల్స్ హబ్స్‌లల్లో వారిని అపాయింట్ చేస్తామని స్పష్టం చేశారు. కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్‌ను మరింత బలోపేతం చేయడానికి 1,400 మందిని అపాయింట్ చేస్తామనీ పేర్కొన్నారు. ఈ ఈఓఆర్ఎస్ పీరియడ్‌లో గత ఏడాది కంటే రెట్టింపు వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని నందిత సిన్హా వ్యాఖ్యానించారు.

English summary

Myntra: 27,500 మందికి ఉద్యోగాలు: ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ సంచలనం | Myntra is recruiting 27500 workers on temporary basis for its sale which starts on June 11

Myntra said it will create 27,500 for its upcoming sale which starts on June 11. The company is recruiting temporary workers for delivery, warehouse, and customer support among others.
Story first published: Sunday, June 5, 2022, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X