For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter: ట్విట్టర్‍లో ఇక నుంచి మూడు రకాల టిక్ మార్కులు..!

|

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ (బ్లూ వెరిఫైడ్ మార్క్) సేవను వచ్చే శుక్రవారం నుంచి మళ్లీ ప్రారంభించబోతోంది. ఈసారి బ్లూ టిక్ తో పాటు మీరు బూడిద, గోల్డ్ కలర్ టిక్ మార్కులు కూడా ఉంటాయి. ఈ మేరకు ట్విట్టర్ టిక్ ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశాడు. ట్విట్టర్ తన బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను డిసెంబర్ 2, 2022న మళ్లీ ప్రారంభిస్తుందని మస్క్ పేర్కొన్నాడు.

కంపెనీలకు గోల్డ్

కంపెనీలకు గోల్డ్

"కంపెనీలకు గోల్డ్, ప్రభుత్వాలకు గ్రే , సెలబ్రిటీలు లేదా ఇతర వ్యక్తుల కోసం బ్లూ ఉంటుంది. టిక్ మార్క్ యాక్టివ్ చేసే ముందు ఖాతాను వెరిఫైయి చేస్తారు" మస్క్ తెలిపారు. ట్విట్టర్ ఇటీవల బ్లూ టిక్ కోసం 8 డాలర్లు వసూలు చేసింది. దీంతో భారీగా నకిలీ ఖాతాలకు బ్లూ టిక్ వచ్చి కొన్ని కంపెనీలు వేల కోట్లలో నష్టపోయాయి. 'ఇలై లిల్లీ అండ్ కంపెనీ' అనేది అమెరికాకు చెందిన ఫార్మ కంపెనీ. కానీ ఇదే పేరు మీద ట్విటర్‌లో ఒకరు నకిలీ ఖాతా తెరిచారు. పైగా 8 డాలర్లు చెల్లించి దానికి బ్లూ టిక్ తెచ్చుకున్నారు.

రూ.లక్ష కోట్లకు పైగా నష్టం

రూ.లక్ష కోట్లకు పైగా నష్టం

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది 'ఇలై లిల్లీ అండ్ కంపెనీ'. అయితే ట్విటర్‌లో ఇదే పేరుతో తెరిచిన డూప్లికేట్ ఖాతా ఒక ట్వీట్ చేసింది.'ఇకపై మేం అందరికీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాం' అనేది ఆ ట్వీట్ సారాంశం. ఆ ట్వీట్ చేసిన తరువాత అసలు కంపెనీ 'ఇలై లిల్లీ అండ్ కంపెనీ' షేర్లు పడిపోయాయి. 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయింది. ఇలా ఒక డూప్లికేట్ ఖాతా బ్లూ టిక్ కొనుక్కున్న ఫలితంగా ఒక కంపెనీకి రూ.లక్ష కోట్లకు పైగా నష్టం వచ్చింది. చివరకు ఆ కంపెనీ ట్విటర్‌లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ సేవను కంపెనీ రద్దు చేసింది.

నిత్యం వార్తల్లో

నిత్యం వార్తల్లో

ఈ మధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేసింది. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పై 2021లో నిషేధం విధించారు. టెస్లా అధినేత ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ట్విట్టర్ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఉద్యోగుల తొలగింపుతో పాటు మస్క్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

English summary

Twitter: ట్విట్టర్‍లో ఇక నుంచి మూడు రకాల టిక్ మార్కులు..! | Musk said that tick marks will be available in three colors on Twitter from next Friday

Musk said that tick marks will be available in three colors on Twitter from next Friday
Story first published: Saturday, November 26, 2022, 8:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X