రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు. భారత, ఆసియా కుబేరుడు అయిన ఈయన తాజాగా వారెన్ బఫెట్‌ను దాటేసి, ప్రపంచ ఏడో కుబేరుడిగా నిలిచారు. ఇప్పుడు బఫెట్ కంటే అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధినేత. ఈయన ఆస్తులు 68.3 బిలియన్ డాలర్లు కాగా, వారెన్ బఫెట్ ఆస్తులు 67.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020 జాబితాను విడుదల చేసింది. రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా యూకే బీపీతోను జాయింట్ వెంచర్ ప్రారంభించింది. దీంతో టాప్ 10 ఏకైక ఆసియావాసుల్లో అంబానీ నిలిచారు.

బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ ఇటీవల 37 బిలియన్ డాలర్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చారు. దీంతో ఆయన సంపద తగ్గింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరొందిన బఫెట్ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్చంధంగా ఇచ్చారు. హూరున్ రీసెర్చ్ ప్రకారం ఇటీవల ముఖేష్ అంబానీ ప్రపంచ ఎనిమిదో కుబేరుడిగా నిలిచారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 12.70 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications