For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త సంవత్సరంలో చైనా ఉల్లి రుచి, నేపాల్‌లో కిలో రూ.120, మన వద్ద ఎంతంటే?

|

ఇటీవల ఉల్లి ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉల్లి పండిస్తారు. వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు ఏకంగా రూ.100 నుంచి రూ.150కి పైగా పెరిగాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరల తగ్గుదలకు చర్యలు తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఉల్లి ధర కాస్త తగ్గుతోంది. చైనా ఉల్లి భారత్‌కు రానుంది.

రోజుకు రూ.13తో రూ.1 కోటి, ఇతర బెనిఫిట్స్రోజుకు రూ.13తో రూ.1 కోటి, ఇతర బెనిఫిట్స్

కొత్త సంవత్సరంలో చైనా ఉల్లి రుచి

కొత్త సంవత్సరంలో చైనా ఉల్లి రుచి

చైనా వస్తువులు అంటే భారత్‌లో అందరికీ తెలిసిందే. ఈ వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి. ఇప్పటికే చైనీస్ లైట్లు, బొమ్మలు కొత్త ఏడాదికి ముందు భారత్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు చైనా ఉల్లిని కూడా వినియోగదారులు రుచి చూడనున్నారు. ఉల్లి ధరలు డొమెస్టిక్ మార్కెట్లలో ఇప్పుడిప్పుడే రూ.80 నుంచి రూ.100కు దిగి వస్తున్నాయి. ధరలు దిగి వచ్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగాకేంద్రం చైనా ఉల్లిని కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.

చైనా నుంచి 4,000 టన్నులు.. ధర రూ.70 నుంచి రూ.80

చైనా నుంచి 4,000 టన్నులు.. ధర రూ.70 నుంచి రూ.80

పబ్లిక్ ట్రేడింగ్ ఏజెన్సీ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్ (MMTC) గత వారం 11,000 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుమతికి గ్లోబల్ టెండర్ జారీ చేసిందని, ఇందులో 4,000 టన్నులు చైనా నుంచి, 7,000 టన్నులు టర్కీ నుంచి రానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఉల్లి భారత్‌కు జనవరి 30, 2020 నాటికి రానున్నాయని అధికారులు చెబుతున్నారు. భారత్‌లో ఉల్లి ధరలు కిలో రూ.70 నుంచి రూ.80 మధ్య ఉండే అవకాశముందని చెబుతున్నారు.

నేపాల్‌లో చైనా ఉల్లి ధర రూ.160

నేపాల్‌లో చైనా ఉల్లి ధర రూ.160

అలాగే, కేంద్ర ప్రభుత్వం నెదర్లాండ్స్, ఇరాన్, టర్కీ, రష్యా దేశాల నుంచి కూరగాయలు దిగుమతి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నందున కిలో రూ.120కి పైకి పెరిగినందున వీటిని సేకరించాలని MMTCకి నవంబర్ నెలలో కేంద్రం సూచించింది. కాగా, భారత్‌కు ఉల్లి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ నెల ప్రారంభంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ పీపుల్స్ డెయిలీ పేర్కొంది. అగ్రికల్చరల్ అండ్ ప్రొసీడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రపంచంలో ఎక్కువ ఉల్లి పండేది చైనాలో. ఏడాదికి 20,507 వేల టన్నుల ఉల్లి పండిస్తుంది. ఆ తర్వాత ఇండియా 15,118 వేల టన్నులతో రెండో స్థానంలో ఉంది. నేపాల్‌కు కూడా చైనా ఉల్లి సరఫరా చేస్తుంది. నేపాల్‌లో నవంబర్ నెలలో చైనా ఉల్లి ధర కిలో రూ.100 పలికింది. ప్రస్తుతం అది రూ.160 వరకు పలుకుతోంది.

English summary

కొత్త సంవత్సరంలో చైనా ఉల్లి రుచి, నేపాల్‌లో కిలో రూ.120, మన వద్ద ఎంతంటే? | Move over Chinese lights and toys, this New Year there will be onions from China

Cheap Chinese lights and toys may have inundated Indian markets ahead of New Year, but this time consumers will also get to savour onions from China.
Story first published: Monday, December 23, 2019, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X