సింగపూర్ మిల్లీనియల్స్‌కు ఆర్థిక కష్టాలు: ఆదాయంపై ఆందోళనలు
కరోనా మహమ్మారి మిల్లీనియల్స్‌కు మేలుకొలుపు అని స్టాండర్డ్ చార్టర్ బ్యాంకు సర్వే తెలిపింది. భారత్ సహా 12 దేశాల్లో 12,000 మందిని సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. భారత్, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఇండోనేషియా, కెన్యా, మెయిన్‌లాండ్ చైనా, మలేషియా, పాకిస్తాన్, తైవాన్, యూఏఈ, యూకే, అమెరికా దేశాల్లో మిల్లీనియల్స్ మీద కరోనా ప్రభావం సహా వివిధ అంశాలపై సర్వే నిర్వహించింది. కరోనా ప్రభావం అన్ని రంగాలు, జనరేషన్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దెబ్బతో చాలామంది సేవింగ్స్ పైన దృష్టి సారించారు. ప్రధానంగా మిల్లీనియల్స్ (25 ఏళ్ల నుండి 44 ఏళ్లు) పైన చూపిన ప్రభావం సర్వే నిర్వహించారు.

10 మందిలో ఆరుగురికి ఆర్థిక ఇబ్బంది
మిల్లీనియర్స్ తమ ఖర్చుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు అప్పులు చేయవలసి వస్తుంది. గతంలో కంటే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో భవిష్యత్తు కోసం సేవింగ్స్ పైన కూడా దృష్టి సారించారు. మిల్లీనియల్స్ కరోనాను ఓ ఆర్థిక మేలుకొలుపుగా భావిస్తున్నారు. సింగపూర్‌లో ప్రతి 10 మంది మిల్లీనియల్స్‌లో 6గురు ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 18 శాతం మంది మాత్రమే .తమ పర్సనల్ ఫైనాన్షియల్ పట్ల లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతృప్తిగా ఉన్నారు. గత నెలలో తమ రుణాలు పెరిగాయని 27 శాతం మంది వెల్లడించారు. అదే సమయంలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారిలో 15 శాతం మంది మాత్రమే చెప్పారు.

ఇల్లు, కారు కోసం..
అయితే లాంగ్ టర్మ్‌లో తమ ఫైనాన్షియల్ గోల్స్‌ను చేరుకుంటామని 38 శాతం మంది సింగపూర్ మిల్లీనియల్స్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. 45 ఏళ్ల పైబడిన వారిలో ఈ ధీమా 25 శాతమే ఉంది. 55 ఏళ్లు పైబడిన వారిలో ఈ ధీమా దాదాపు పూర్తిగా సన్నగిల్లింది. ఫైనాన్షియల్ గోల్స్ పరంగా చూస్తే 45 శాతం మంది సింగపూర్ మిల్లీనియల్స్ రిటైర్మెంట్ కోసం, 32 శాతం మంది కారు, ఇల్లు వంటి భారీ కొనుగోళ్ల కోసం ప్లాన్ చేస్తున్నారు. 45 ఏళ్ళు పైబడిన వారిలో 44 శాతం మంది రిటైర్మెంట్ కోసం, 13 శాతం మంది ఇల్లు, కారు వంటి వాటి కోసం చూస్తున్నారు.

ఆదాయంపై అస్పష్టత
తమ ఫైనాన్షియల్ గోల్స్‌ను అందుకునేందుకు 41 శాతం మంది సింగపూర్ మిల్లీనియల్స్ తమ ఖర్చులపై ప్లాన్‌గా ముందుకు సాగుతున్నారు. 43 శాతం మంది తమ రోజువారి ఖర్చుల్లో మార్పులు చేసుకుంటున్నారు. అన్ని వయస్సుల వారిలోను కామన్‌గా ఆదాయం చుట్టూ అనిశ్చితి కనిపించాయి ఈ సర్వేలో.