For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Swiggy: మాకొద్దీ మాయదారి స్విగ్గీ.. గుడ్ బై చెబుతున్న రెస్టారెంట్లు.. అసలు ఏమైంది..?

|

Swiggy: కస్టమర్లకు చేరువ కావటానికి, వ్యాపారాలను విస్తరించుకోవటానికి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు మెుదట్లో భారీగానే దోహదపడ్డాయి. ఈ క్రమంలో హోటల్స్, రెస్టారెంట్లు సైతం వారితో జతకట్టేందుకు ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

డిస్కౌంట్స్..

డిస్కౌంట్స్..

దేశవ్యాప్తంగా ఉన్న వందలాది డైనింగ్ అవుట్‌లెట్‌లు స్విగ్గీ కస్టమర్ల కోసం భారీగా డిస్కౌంట్‌లను ప్రకటించటానికి వ్యతిరేకంగా నిరసనకు దిగాయి. స్విగ్గీ డైనౌట్ నుంచి తమ అకౌంట్లను తొలగిస్తున్నాయి. ఖర్చులు పెరిగిన ప్రస్తుత తరుణంలో భారీ తగ్గింపులు అందించలేమని తేల్చి చెబుతున్నాయి.

ప్రముఖ బ్రాండ్స్..

ప్రముఖ బ్రాండ్స్..

దేశవ్యాప్తంగా 13 నగరాల్లోని 400 కంటే ఎక్కువ బ్రాండ్‌లు, 900 డైనింగ్ అవుట్‌లెట్‌లు గడచిన రెండు వారాల్లో స్విగ్గీకి డీలిస్టింగ్ నోటీసులు పంపాయి. మరో 2,000 ఔట్‌లెట్లు ఇదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఢిల్లీ-NCR ప్రాంతంలో కేఫ్ ఢిల్లీ హైట్స్, స్మోక్ హౌస్ డెలి, సోషల్, ది బీర్ కేఫ్, మమగోటోతో సహా హై-ఎండ్ ఈటరీస్ ఉన్నాయి. Swiggy ప్రస్తుతం Dineoutలో 15,000 రెస్టారెంట్లు మరియు కేఫ్‌లను కలిగి ఉంది.

వ్యాపార అంతరాయాలు..

వ్యాపార అంతరాయాలు..

డైన్‌అవుట్ పాటిస్తున్న భారీ డిస్కౌంటింగ్ రెస్టారెంట్ల ప్రధాన వ్యాపారానికి అంతరాయం కలిగిస్తోందని NRAI నిందిస్తోంది. ఈ తగ్గింపులను అలవాటు చేయటం ప్రమాదకరమైన సంస్కృతికి దారితీస్తోందని ఆరోపించింది. 30 శాతం వరకు క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్లను అందించటం రెస్టారెంట్ల లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తోందని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఫుడ్‌టెక్ అగ్రిగేటర్లకు 4-10% కమిషన్ చెల్లించాల్సి రావటం లాభాలను ఆవిరి చేస్తోంది.

స్విగ్గీకి ఎదురుదెబ్బ..

స్విగ్గీకి ఎదురుదెబ్బ..

డైన్-ఇన్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనవద్దని NRAI రెస్టారెంట్‌లను కోరిన తర్వాత ఇది జరుగుతోంది. ఒకపక్క పెరుగుతున్న నష్టాలకు తోడు ఇప్పుడు రెస్టారెంట్స్ వైదొలగటం స్విగ్గీ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుందని తెలుస్తోంది. Dineoutలోని రెస్టారెంట్ భాగస్వాములు ఎంత డిస్కౌంట్స్ అందించాలనుకుంటున్నాయో అవే నిర్మయించుకోవచ్చని స్విగ్గీ ప్రతినిధి తెలిపారు. 2019లో జొమాటో విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.

Read more about: swiggy dineout restaurants zomato
English summary

Swiggy: మాకొద్దీ మాయదారి స్విగ్గీ.. గుడ్ బై చెబుతున్న రెస్టారెంట్లు.. అసలు ఏమైంది..? | More than 900 Restaurants Left Swiggy Dineout With Heavy Discounts Offering

More than 900 Restaurants Left Swiggy Dineout With Heavy Discounts Offering
Story first published: Friday, October 28, 2022, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X