For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరిస్థితి దారుణం: అమెరికన్లు అప్పటి దాకా బయటకు రారు! 10 ఏళ్ల వరకు కోలుకోనంత నష్టం

|

కరోనా మహమ్మారి కారణంగా అమెరికా ఆర్థిక చిన్నాభిన్నమవుతోంది. దాదాపు పద్నాలుగు లక్షల కేసులు, సుమారు 82,000 మరణాలు చోటు చేసుకున్నాయి. అగ్రరాజ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. కంపెనీలు మూతబడి, ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. గత మూడు నెలల్లో పెద్ద మొత్తంలో ఇక్కడ నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వేతనంలో కోత, ఉద్యోగాల తొలగింపు: టెక్ మహీంద్రాకు నోటీసులు, అసలేం జరిగింది?వేతనంలో కోత, ఉద్యోగాల తొలగింపు: టెక్ మహీంద్రాకు నోటీసులు, అసలేం జరిగింది?

కోట్లాది మంది ఉద్యోగాలు పోయి.. భృతి కోసం

కోట్లాది మంది ఉద్యోగాలు పోయి.. భృతి కోసం

జనవరి నుండి మార్చి వరకు సగటున ప్రతి వారం 3,50,000 మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత ఆరు వారాల్లో అంటే ఏప్రిల్ నుండి ఇది మరింత పెరిగింది. గత ఏడు వారాల్లో వరుసగా 3.3 మిలియన్ల మంది, 6.8 మిలియన్ల మంది, 6.6 మిలియన్ల మంది, 5.2 మిలియన్ల మంది, 4.4 మిలియన్ల మంది, 3.8 మిలియన్ల మంది, 3.2 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఈ కాలంలోనే 3.3 కోట్ల మంది కంటే ఎక్కువ నిరుద్యోగ భృతి కింద దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా లేబర్ ఫోర్స్ 165 మిలియన్లు. ఇందులో 33 మిలియన్ల మంది అంటే 20 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. అమెరికాలో ఉపాధి దాదాపు సగం మంది కోల్పోయారు.

వారాల వ్యవధిలో అతలాకుతలం

వారాల వ్యవధిలో అతలాకుతలం

అమెరికా జాబ్ మార్కెట్ కేవలం కొన్ని వారాల్లో.. అంటే రెండు నెలల వ్యవధిలో అతలాకుతలమైంది. సొంత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడంతో గ్రీన్ కార్డు జారీ ఆలస్యం, H1B ఆంక్షలు వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. లేబర్ మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీసింది కరోనా మహమ్మారి.

కోలుకోవడానికి ఎంత సమయం

కోలుకోవడానికి ఎంత సమయం

అమెరికా జాబ్ మార్కెట్, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి రెండేళ్లు లేదా అంతకంటే కాస్త ఎక్కువే పట్టవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటే వెంటనే కొన్ని ఉద్యోగాలు రావొచ్చునని, మరికొన్ని ఉద్యోగాలు పోవచ్చునని చెప్పారు. ఇంకొన్ని ఉద్యోగాలు అసలు రాకపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని, దీంతో వైద్య ప్రక్రియకే సమయం పడుతుందని అంటున్నారు.

అమాంతం పెరిగిన నిరుద్యోగ రేటు

అమాంతం పెరిగిన నిరుద్యోగ రేటు

ఏప్రిల్ నెలలో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి పెరిగింది. ఇప్పుడు మరింత పెరిగింది. మహామాంద్యం తర్వాత నిరుద్యోగ రేటు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో 3.5 శాతం, మార్చిలో 4.4 శాతం మాత్రమే ఉండింది. కానీ ఆ తర్వాత అమాంతం నాలుగైదు రెట్లు పెరిగింది. మే నెలలో నిరుద్యోగిత రేటు 20 శాతానికి చేరుకుంది.

త్వరగా కోలుకోలేనంత భారీ నష్టం

త్వరగా కోలుకోలేనంత భారీ నష్టం

వచ్చే ఏడాది నాటికి కూడా లేబర్ మార్కెట్ పూర్తిగా కోలుకోకపోవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరగా కోలుకోలేనంత భారీ నష్టం జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి జీవితం గందరగోళంలో పడిపోయిందని వాపోతున్నారు. అయితే 2020 చివరి నాటికి నిరుద్యోగిత రేటు కాస్త కోలుకొని దాదాపు 10 శాతానికి రావొచ్చునని ఆశిస్తున్నారు.

అప్పటి దాకా అమెరికన్లు వీటికి దూరం..

అప్పటి దాకా అమెరికన్లు వీటికి దూరం..

కరోనా వైరస్ టీకా వచ్చే వరకు చాలామంది అమెరికన్లు పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రెస్టారెంట్లు, కచేరీలు, స్టేడియాలకు వంటి చోట్లకు వెళ్లడం మానేస్తారని చెబుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ కలిగి ఉండి సామాజిక దూరం పాటించేందుకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. 2021 చివరి నాటికి నిరుద్యోగిత రేటు 7.5 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. 2022 నాటికి కానీ సంక్షోభం నుండి అమెరికా పూర్తిగా బయటపడే అవకాశాలు పరిస్థితి లేదంటున్నారు.

పదేళ్లు పట్టవచ్చు

పదేళ్లు పట్టవచ్చు

నిరుద్యోగిత రేటు 4 శాతం నుండి 5 శాతానికి రావడానికి మూడు లేదా నాలుగేళ్లు పట్టవచ్చునని అంటున్నారు. మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ సున్నితంగా ఉండేచోట నిరుద్యోగిత కోలుకోవడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వినోద పరిశ్రమపై భారీ ప్రభావం పడవచ్చునని చెబుతున్నారు. ట్రావెల్, టూరిజంలలో శాశ్వత మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అమెరికా నిరుద్యోగిత రేటు తిరిగి 3.5 శాతానికి చేరుకోవడానికి పదేళ్ల వరకు పట్టవచ్చునని అంటున్నారు.

English summary

పరిస్థితి దారుణం: అమెరికన్లు అప్పటి దాకా బయటకు రారు! 10 ఏళ్ల వరకు కోలుకోనంత నష్టం | More than 33 million people in the US have filed for unemployment benefits

Another 3 million people filed unemployment claims last week, bringing the total since the beginning of the pandemic to a staggering 33 million.
Story first published: Tuesday, May 12, 2020, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X