For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2.5 శాతమే: భారత వృద్ధి రేటును సగానికి సగం తగ్గించిన మూడీస్

|

కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ ఏడాదికి గాను భారీగా తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.3 శాతంగా ఉంటుందని గతంలో అంచనా వేసింది. ఇప్పుడు దీనిని సగాని కంటే ఎక్కువ తగ్గించి 2.5 శాతానికి పరిమితం చేసింది.

భారత ప్రభుత్వం, సౌతాఫ్రికా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని మూడీస్ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో భారత వృద్ధి రేటు వచ్చే ఏడాదికి గతంలో అంచనా వేసిన 5.3 శాతం నుండి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరానికి 3.2 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. చైనా వృద్ధి రేటును 2020కి 3.3 శాతానికి, 2021కి 6 శాతానికి సవరించింది.

'డబుల్' తలనొప్పి: ట్రంప్ 2,200 హోటల్ రూమ్‌లు ఖాళీ, అన్ని క్లోజ్.. భారీ నష్టం'డబుల్' తలనొప్పి: ట్రంప్ 2,200 హోటల్ రూమ్‌లు ఖాళీ, అన్ని క్లోజ్.. భారీ నష్టం

Moodys cuts India 2020 growth forecast to 2.5 percent

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. మార్కెట్లు వరుస నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇటీవల అమెరికా, భారత్ సహా వివిధ దేశాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడంతో మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.

English summary

2.5 శాతమే: భారత వృద్ధి రేటును సగానికి సగం తగ్గించిన మూడీస్ | Moody's cuts India 2020 growth forecast to 2.5 percent

Moody’s Investors Service on Friday slashed India’s economic growth projection for 2020 to 2.5% from 5.3% earlier, holding that the COVID-19 outbreak will cause unprecedented shock to the global economy.
Story first published: Friday, March 27, 2020, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X