For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ మెుత్తాన్ని పెంచే ఆలోచనలో మోదీ సర్కార్..!

|

PM Kisan: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దేశంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మోదీ సర్కార్ రైతులకు త్వరలోనే శుభవార్త చెప్పేందుకు సిద్ధమౌతోందని సమాచారం. ఇది లబ్ధిదారులుగా ఉన్న రైతులకు చాలా కీలకమైన వార్తగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2023 బడ్జెట్ వరం..

2023 బడ్జెట్ వరం..

దేశంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో దేశంలోని రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేయటానికి అవసరమైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రైతులకు చాలా ప్రత్యేకమైనదిగా నిలువనుంది.

ద్రవ్యోల్బణం తరుణంలో..

ద్రవ్యోల్బణం తరుణంలో..

దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో ఉండటంతో ఈ సారి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై సామాన్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ప్రకటన రావటం రైతుల్లో ఉత్కంఠను పెంచుతోంది. రైతులకు అందుతున్న మెుత్తాన్ని పెంచాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నప్పటికీ దానిపై వాయిదాల పర్వం నడిచింది.

పెంపు ఎంత ఉంటుంది..

పెంపు ఎంత ఉంటుంది..

ఇప్పటి వరకు కేంద్రం రైతులకు ఏడాదికి పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6000 చెల్లిస్తోంది. అయితే ఈ మెుత్తాన్ని రూ.2000 పెంచి రూ.8000 కు చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే ఏడాదికి నాలుగు విడతలుగా ఈ మెుత్తాన్ని రూ.2000 చొప్పున చెల్లించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది అమలులోకి వస్తే ఏడాదికి మూడు సార్లకు బదులుగా నగదు నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లోకి వస్తుంది.

13వ విడత..

13వ విడత..

ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా దేశంలోని రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మెుత్తం 12 విడతలు డబ్బును జమ చేసింది. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 13వ విడత డబ్బు చేరే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన తేదీ వివరాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. పీఎం కిసాన్ సొమ్ము పొందేందుకు అవసరమైన పత్రాలను అందించటంతో పాటు కేవైసీ ప్రక్రియను సకాలంలో రైతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులు రానున్న బడ్జెట్ ప్రకటనలో ఈ అంశంపై ఎలాంటి ప్రకటన వస్తుందనే దానికోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కేంద్రం రైతుల ఆకాంక్షలను నెరవేర్చుతుందా లేక నీరుకారుస్తుందో వేచి చూడాల్సిందే.

English summary

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ మెుత్తాన్ని పెంచే ఆలోచనలో మోదీ సర్కార్..! | Modi government planning to increase PM Kisan amount in coming union budget

Modi government planning to increase PM Kisan amount in coming union budget
Story first published: Friday, December 9, 2022, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X