For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cabinet On UPI: యూపీఐ లావాదేవీలపై కీలక నిర్ణయం.. ఎన్ఆర్ఐలకు పెద్ద శుభవార్త..

|

Cabinet On UPI: డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన డిజిటల్ చెల్లింపుల పర్యావరణాన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.

క్యాబినెట్ నిర్ణయం..

క్యాబినెట్ నిర్ణయం..

చిన్న మొత్తంలో డిజిటల్ లావాదేవీలకు రూ.2,600 కోట్ల ప్రోత్సాహక మొత్తాన్ని మోడీ మంత్రివర్గం ఆమోదించింది. BHIM UPI నుంచి జరిపే లావాదేవీలపై ప్రోత్సాహకం అందుబాటులో ఉంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు గతంలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి నిర్ణయాలు ఉండబోవని మోదీ సర్కార్ తాజా నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పింది. దీనితో పాటు మూడు బహుళస్థాయి సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఉచిత ఆహారం..

ఉచిత ఆహారం..

దేశంలో అమలవుతున్న ప్రధాన మంత్రి ఫ్రీ ఫుడ్ స్కీమ్ పేరును మార్చాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. ఇకపై కార్యక్రమానికి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని నామకరణం చేయాలని నిర్ణయించారు.గత కేబినెట్‌లో ఉచిత ఆహార పథకాన్ని ఏడాది పాటు పొడిగించిన విషయం తెలిసిందే. మల్టీ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 ప్రకారం జాతీయ స్థాయి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ సొసైటీకి మోదీ కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.

గ్రీన్ హైడ్రోజన్..

గ్రీన్ హైడ్రోజన్..

భవిష్యత్తు ఇంధన అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రతి సంవత్సరం 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతోంది. అయితే భారత్ గ్రీన్ హైడ్రోజన్‌ తయారీలో ముందువరుసలో కొనసాగుతూ గ్లోబల్ హబ్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా దేశంలో రూ.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, 6 లక్షల ఉద్యోగాలు సైతం వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

ప్రవాస భారతీయుల కోసం..

ప్రవాస భారతీయుల కోసం..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI ఎకోసిస్టమ్‌ని కొన్ని దేశాల నుంచి నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్(NRE), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (NRO) ఖాతాల వంటి అంతర్జాతీయ ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులను అనుమతించమని కోరింది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే త్వరలో NRIలు మెుబైల్ నంబర్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులు చేయగలరని తెలుస్తోంది.

English summary

Cabinet On UPI: యూపీఐ లావాదేవీలపై కీలక నిర్ణయం.. ఎన్ఆర్ఐలకు పెద్ద శుభవార్త.. | Modi government cabinet descided to promote BHIM UPI Payments, NRI's benefit

Modi government cabinet descided to promote BHIM UPI Payments, NRI's benefit
Story first published: Wednesday, January 11, 2023, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X