For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LinkedIn layoffs: ఉద్యోగుల తొలగింపు ప్రకటించిన దిగ్గజం.. అక్కడ వ్యాపారం క్లోజ్..

|

LinkedIn layoffs: అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు చాలా డైనమిక్ గా మారాయి. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని జాబ్స్ సెర్చ్ యాప్ లింక్డ్‌ఇన్ తాజాగా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది.

జాబ్ సెర్చ్ దిగ్గజం లింక్డ్‌ఇన్ దాదాపు 716 మంది ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో అమెరికా కంపెనీ చైనా-ఫోకస్డ్ జాబ్ అప్లికేషన్‌ను మూసివేయడానికి సిద్ధమైంది. బలహీనపడుతున్న ప్రపంచ ఆర్థిక దృక్పథం, డిమాండ్ తగ్గుదల మధ్య తాజా నిర్ణయం వెలువడింది.

LinkedIn layoffs

లింక్డ్‌ఇన్‌లో దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత సంవత్సరం ప్రతి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ.. దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో సహా కార్మికులను తొలగించడంలో ప్రధాన సాంకేతిక సంస్థల హోస్ట్‌లో చేరింది. ఇది దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసింది. కార్యక్రమాలను క్రమబద్దీకరించటంతో పాటు నిర్ణయాలు వేగవంతం చేసేందుకు తగిన రూట్ ఏర్పాటు చేస్తామని CEO ర్యాన్ రోస్లాన్స్కీ ఉద్యోగులకు లేఖ ద్వారా తెలిపారు.

LinkedIn layoffs

గడచిన ఆరు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ టెక్ కంపెనీలు దాదాపు 2.70 లక్షల ఉద్యోగులను తొలగించాయి. వీటిలో అగ్రభాగం అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీల నుంచే నమోదయ్యాయి. మైక్రోసాఫ్ట్ 2016లో లింక్డ్‌ఇన్‌ను 26 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇటీవలి నెలల్లో దాదాపు 10,000 ఉద్యోగాల కోతలను ప్రకటించింది. ప్రస్తుతం మరిన్ని ఉద్యోగుల తొలగింపులు అనేక కంపెనీల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

English summary

LinkedIn layoffs: ఉద్యోగుల తొలగింపు ప్రకటించిన దిగ్గజం.. అక్కడ వ్యాపారం క్లోజ్.. | Microsoft's LinkedIn layoffs 716 employees and shutting china operations, Know details

Microsoft's LinkedIn layoffs 716 employees and shutting china operations, Know details
Story first published: Tuesday, May 9, 2023, 10:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X