For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైర్మన్‌గా... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు అరుదైన అవకాశం

|

మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను సీఈవో కమ్ చైర్మన్‌గా నియమిస్తూ సంస్థ బోర్డ్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఒకే వ్యక్తి నియమితులు కావడం రెండు దశాబ్దాల్లో ఇది తొలిసారి. 2000లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బిల్ గేట్స్ వైదొలిగారు. ఈ సంస్థకు సత్య నాదెళ్ల మూడో సీఈవో. అలాగే మూడో చైర్మన్ కూడా. ఇంతకుముందు బిల్ గేట్స్, జాన్ థామ్సన్ చైర్మన్లుగా వ్యవహరించారు. 2014లో బిల్ గేట్స్ నుండి థంప్సన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత థంప్సన్ నుండి సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. బిల్ గేట్స్ స్థానంలో సీఈవోగా స్టీవ్ బాల్మర్ పని చేశారు. 2014లో స్టీవ్ బాల్మర్ నుండి సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు.

7 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు భారతీయ అమెరికన్ సత్య నాదెళ్ల. ఈయనకు ఇప్పుడు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. అమెరికాలో భారతీయుడికి దక్కిన ఓ అరుదైన గౌరవంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సీఈవో నుండి ఛైర్మన్ పదవి దక్కించుకోవడం ద్వారా సత్యనాదెళ్ల పట్టు నిరూపించుకున్నారు.

Microsoft elevates CEO Satya Nadella as chairman

సాఫ్టువేర్‌ రంగంలో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన మైక్రోసాఫ్ట్‌ సంస్ధకు సత్యనాదెళ్ల ఇప్పుడు మూడో ఛైర్మన్. ఇప్పటివరకు ఛైర్మన్‌ పదవిలో ఉన్న జాన్ థాంప్సన్‌ తన పాత పదవి అయిన ఇండిపెండెంట్ డైరెక్టర్‌ పదవిలోకి వెళ్లిపోనున్నారు.

English summary

చైర్మన్‌గా... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు అరుదైన అవకాశం | Microsoft elevates CEO Satya Nadella as chairman

indian american microsoft ceo satya nadella appointed as new chairman of the firm after gates and thomson.
Story first published: Thursday, June 17, 2021, 20:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X