For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bill Gates: బిల్ గేట్స్ 48 ఏళ్ల పాత రెజ్యూమ్.. నెట్టింట్రో వైరల్.. అందులో ఏముందంటే..

|

Bill Gates Resume: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆయన విజయం ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తిగా మారింది. బిల్ గేట్స్ విజయాన్ని గమనిస్తే.. కృషితో ముందుకు సాగితే కలలు ఖచ్చితంగా నెరవేరుతాయని నిరూపిస్తుంది. దీనికి కావలసింది కేవలం కష్టపడి పనిచేయడం, సహనంతో ముందుకు సాగటమే. ప్రస్తుతం బిల్ గేట్స్ రెజ్యూమ్ చాలా హెడ్‌లైన్ గా మారింది. నిజానికి, ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తికి రెజ్యూమ్ అంటే ఏమిటో మనందరికీ బాగా తెలుసు. తాజాగా బిల్ గేట్స్ Linkedinలో ఉంచిన 48 ఏళ్ల పాత రెజ్యూమ్ అందరినీ ఆకర్షిస్తోంది.

రెజ్యూమ్‌ గురించి గేట్స్ ఏమన్నారంటే..

రెజ్యూమ్‌ గురించి గేట్స్ ఏమన్నారంటే..

ఉద్యోగం పొందడానికి రెజ్యూమ్‌లో మన విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను బాగా ప్రతిబింబించేలా ఉండాలి. నియామకాల్లో సెలెక్ట్ అవ్వటానికి రెజ్యూమ్ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఇటీవల 48 సంవత్సరాల క్రితం తన రెజ్యూమ్‌ను పంచుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ.. ఈరోజు రెజ్యూమ్ తన కంటే చాలా మెరుగ్గా ఉందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని చెప్పారు.

1974 నాటి రెజ్యూమ్‌..

1974 నాటి రెజ్యూమ్‌..

గేట్స్ షేర్ చేసిన 1974 రెజ్యూమ్‌లో ఆయన పేరు విలియం హెచ్. గేట్స్ అని ఉంది. ఆయన హార్వర్డ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు దీనిని రూపొందించారు. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి కోర్సులు చేశానని బిల్ గేట్స్ తన రెజ్యూమ్‌లో పేర్కొన్నారు. FORTRAN, COBOL, ALGOL, BASIC మొదలైన అన్ని ప్రధాన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో తనకు అనుభవం ఉందని రెజ్యూమ్‌లో రాశారు.

పని అనుభవం..

పని అనుభవం..

గేట్స్ 1973లో TRW సిస్టమ్స్ గ్రూప్‌లో సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా తనకు ఉన్న అనుభవాన్ని పేర్కొన్నారు. బిల్ గేట్స్ 1972లో సీటెల్‌లోని లేక్‌సైడ్ స్కూల్‌లో కాంట్రాక్ట్‌పై సహ-నాయకుడిగా, సహ భాగస్వామిగా పనిచేసినట్లు అందులో తెలిపారు. ఈ రెజ్యూమ్‌ని చూసిన తర్వాత ప్రజలు సోషల్ మీడియాలో స్పీడ్‌గా తమ స్పందిస్తున్నారు.

బిల్ గేట్స్ పర్ఫెక్ట్ అంటూ..

బిల్ గేట్స్ పర్ఫెక్ట్ అంటూ..

చాలా మంది సోషల్ యూజర్లు బిల్ గేట్స్ రెజ్యూమ్ పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఈ రెజ్యూమ్‌కి 48 ఏళ్లు వచ్చినప్పటికీ.. ఇది చాలా అద్భుతంగా ఉందని ఒక ఫాలోవర్ కామెంట్ చేశాడు. ఇలా మరొకరు "బిల్ గేట్స్.. గ్రేట్ వన్ పేజ్ రెజ్యూమ్‌ను షేర్ చేసినందుకు ధన్యవాదాలు" అని కామెంట్ చేశాడు. ఇలా అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే.. మనమందరం వెనక్కి వెళ్లి ఒక్కసారి మన మునుపటి రెజ్యూమ్‌ కాపీలను చూసుకుంటే కలిగే ఆనందాన్ని అనుభవించాలి.

English summary

Bill Gates: బిల్ గేట్స్ 48 ఏళ్ల పాత రెజ్యూమ్.. నెట్టింట్రో వైరల్.. అందులో ఏముందంటే.. | microsoft co-founder bill gates shared his 48 years old resume that was prepared in 1974 in his linkedin profile going viral

microsoft co-founder bill gates shared his 48 years old interesting resume
Story first published: Saturday, July 2, 2022, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X