For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంధనంపై మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్, ఏటా రూ.5,000 కోట్లు ఆదా: ఖర్చు, పొల్యూషన్.. ప్రయోజనాలే..

|

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మిథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్‌ను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తోంది. దీని వల్ల ఫ్యూయల్ బిల్లు కనీసం 10 శాతం తగ్గుతుంది. అలాగే వాహనాల పొల్యూషన్ 30 శాతం వరకు తగ్గుతుంది. దీంతో ప్రతి ఏటా ఇంధన దిగుమతుల బిల్లులు రూ.5,000 కోట్ల వరకు తగ్గి, ఆ మేరకు ఆదా చేసినట్లు అవుతుంది.

19ఏళ్ల క్రితం రూ.500 ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.63,00019ఏళ్ల క్రితం రూ.500 ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.63,000

నితిన్ గడ్కరీ లేఖ

నితిన్ గడ్కరీ లేఖ

పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ మేరకు రోడ్ ట్రాన్సుపోర్ట్, అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ లేఖ రాశారు. మిథనాల్ ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కావాల్సిన మార్గాలను అన్వేషించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఖర్చు చాలా తక్కువ

ఖర్చు చాలా తక్కువ

ప్రస్తుతం భారత్‌లో 10 శాతం ఇథెనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్‌తో నడుస్తున్నాయి. ఇథెనాల్ తయారీకి అయ్యే ఖర్చు లీటరుకు రూ.42. అదే సమయంలో మిథనాల్ లేదా మిథనాల్ ఆల్కాహాల్ ఖర్చు లీటరుకు రూ.20 మాత్రమే. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) ఇప్పటికే వాణిజ్య వాహనాల కోసం M15 బ్లెండెడ్ ఫ్యూయల్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో 15% మిథనాల్, 85% పెట్రోల్ ఉంటుంది.

స్వాగతిస్తున్న పరిశ్రమ

స్వాగతిస్తున్న పరిశ్రమ

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మిథనాల్ ఫ్యూయల్ వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించింది. తదుపరి పనులను పెట్రోలియం శాఖ చూసుకోనుంది. అంటే ఈ ఫ్యూయల్‌ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావడం ఈ శాఖ పరిధిలోనిదే. దీనికి పరిశ్రమ మద్దతు కూడా ఉంది. ఇంధన భద్రత కోణం నుంచి మల్టీ ఫ్యూయల్ ఆప్షన్ కచ్చితంగా పరిశీలించదగ్గ అంశమని ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) రాజేష్ మీనన్ అన్నారు.

English summary

ఇంధనంపై మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్, ఏటా రూ.5,000 కోట్లు ఆదా: ఖర్చు, పొల్యూషన్.. ప్రయోజనాలే.. | Methanol blend on cards, may trim oil import bill by Rs 5,000 crore

The government is looking at introducing methanol-blended fuel pan India a move that can potentially reduce one’s fuel bill by at least 10%, lower vehicular pollution levels by over 30%, and save the exchequer Rs 5,000 crore in annual import bill.
Story first published: Monday, December 23, 2019, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X