For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్

|

10 ప్రభుత్వరంగ బ్యాంకుల స్థానంలో నేటి (ఏప్రిల్ 1) నుండి నాలుగు బ్యాంకులే కనిపిస్తాయి. ఈ రోజుతో ఆంధ్రా బ్యాంక్ సహా ఆరు ప్రభుత్వరంగ బ్యాంకుల చరిత్రపుటల్లోకి చేరాయి. అలహాబాద్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు ఈ రోజు నుండి కనిపించవు! ఈ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకుల్లో విలీనమయ్యాయి.

ఇండస్‌ఇండ్ ట్రబుల్: రూ.22,000 కోట్ల డిపాజిట్లు వెనక్కిఇండస్‌ఇండ్ ట్రబుల్: రూ.22,000 కోట్ల డిపాజిట్లు వెనక్కి

కస్టమర్లకు ఇబ్బంది లేకుండా..

కస్టమర్లకు ఇబ్బంది లేకుండా..

బ్యాంకుల భారీ విలీనం దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను 12కు పరిమితం చేసింది. దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ ఉంది. ఇప్పుడు ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకులు ఉంటాయి. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు బ్యాంకులు చెబుతున్నాయి. విలీనం తర్వాత ఖాతాదారులపై ప్రభావం ఉండదని చెబుతున్నారు.

బ్యాంకులు.. విలీనం

బ్యాంకులు.. విలీనం

1 పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓబీసీ, యూబీఐ, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకులో విలీనమవుతున్నాయి. ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంకు విలీనం నేడు పూర్తయినట్లే.

చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంకు

చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంకు

ఆంధ్రా బ్యాంకు కథ ఈ రోజు నుండి చరిత్ర పుటల్లోకి ఎక్కినట్లే. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబర్‌లో ప్రయివేటు బ్యాంకుగా ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. డిపాజిట్స్ రూ.50 కోట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో 1969లో జాతీయకరణ నుంచి తప్పించుకుంది. ఇందిరా రెండోసారి అధికారంలోకి వచ్చాక 1980 ఏప్రిల్ నెలలో ఆంధ్రా బ్యాంక్‌ను జాతీయీకరించారు. ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది.

ఆంధ్రా బ్యాంకు గురించి క్లుప్తంగా..

ఆంధ్రా బ్యాంకు గురించి క్లుప్తంగా..

ఆంధ్రా బ్యాంకును 20 నవంబర్ 1923లో ప్రారంభించారు. అదే నెలలో 28న బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. 1969 నుండి 1980 మధ్య నెంబర్ వన్ ప్రయివేటు బ్యాంకుగా గుర్తింపు పొందింది. 15 జనవరి 1980లో జాతీయీకరించారు. 1981లో తొలుత క్రెడిట్ కార్డుల వ్యాపారం ప్రారంభించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2885 శాఖలు, 3798 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. 1 ఏప్రిల్ 2020న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో విలీనమైంది.

English summary

ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్ | Merger of 10 public sector banks: Know about Andhra Bank

Ten Public Sector Undertaking (PSU) banks will be amalgamated into four banks from today, 1 April. In the biggest consolidation exercise in the banking space, the government in August 2019 had announced the merger of 10 public sector lenders into four bigger and stronger banks.
Story first published: Wednesday, April 1, 2020, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X