For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 లక్షల కార్లల్లో సాంకేతిక లోపాలు: మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం

|

బెర్లిన్: లగ్జూరియస్ కార్ల పేర్లు తలచుకోగానే గుర్తుకొచ్చేది మెర్సిడెజ్ బెంజ్. జర్మనీకి చెందిన టాప్ కార్ మేకర్స్ కంపెనీ ఇది. ఈ కంపెనీ బేసిక్ కారు ధరే 50 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. ఇక హైఎండ్ కార్ల ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. జర్మనీలోని స్టట్‌గార్ట్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తోందీ మెర్సిడెజ్ బెంజ్. ఈ మధ్యకాలంలో చిప్ షార్టేజ్ వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సకాలంలో డెలివరీలను ఇవ్వలేకపోతోంది.

ఆ జాతీయ బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా: రూ. లక్షల్లో పెనాల్టీఆ జాతీయ బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా: రూ. లక్షల్లో పెనాల్టీ

తాజాగా- ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ కార్లను వెనక్కి పిలిపించాలని నిర్ణయించుకుంది. కార్ల బ్రేకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2004 నుంచి 2015 మధ్యకాలంలో తయారైన వాటిల్లో 10 లక్షల కార్లను వెనక్కి పిలిపించేలా మెర్సిడెజ్ బెంజ్ త్వరలోనే ఆదేశాలను జారీ చేయనున్నట్లు జర్మన్ ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ సిరీస్, ఆర్-క్లాస్ లగ్జరీ మినీవ్యాన్‌లను రీకాల్ చేసినట్లు పేర్కొంది.

Mercedes-Benz Group AG will recall almost a million vehicles worldwide here is the reason

హార్డ్ బ్రేకింగ్ మాన్యువర్ వల్ల మెకానికల్ డ్యామేజెస్ ఏర్పడినట్లు భావిస్తున్నామని మెర్సిడెజ్ బెంజ్ గ్రూప్ ఏజీ వివరణ ఇచ్చింది. వెహికల్ బ్రేక్ బూస్టర్‌లో సమస్యలు తలెత్తి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. బ్రేక్ బూస్టర్‌లో సాంకేతిక ఇబ్బందులు, మెకానికల్ డ్యామేజెస్ సంభవించడం అనేది అత్యంత అరుదైన విషయమని వ్యాఖ్యానించింది. దీన్ని సవరించడానికి చర్యలు తీసుకున్నామని, వాటిని రీకాల్ చేస్తామని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 9,93,000 ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ సిరీస్, ఆర్-క్లాస్ లగ్జరీ మినీవ్యాన్‌లను విక్రయించింది మెర్సిడెజ బెంజ్. ఇందులో 70,000 కార్లు ఒక్క జర్మనీలోనే అమ్ముడయ్యాయి. ఆథరైజ్డ్ డీలర్ల ద్వారా ఇప్పుడు వాటన్నింటినీ రీకాల్ చేయనుంది. బ్రేక్ బూస్టర్‌లో సమస్యలను తొలగించిన అనంతరం వాటిని క్లయింట్లకు డెలివరీ చేస్తుంది. మూడునెలల వ్యవధిలో ఈ ప్రక్రియ మొత్తాన్నీ ముగించేలా మెర్సిడెజ్ బెంజ్ ప్రణాళికలను రూపొందించుకుంది.

English summary

10 లక్షల కార్లల్లో సాంకేతిక లోపాలు: మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం | Mercedes-Benz Group AG will recall almost a million vehicles worldwide here is the reason

Mercedes-Benz Group AG will recall almost a million vehicles worldwide because of a potential problem with the braking system.
Story first published: Sunday, June 5, 2022, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X